కూర్చొనే ఉంటే... కష్టమే!

‘కూర్చొనే ఉండటం అనేది కొత్తరకం ధూమపానంలాంటిది’ అని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఉద్యోగరీత్యా ఏడెనిమిది గంటలు ఒకే భంగిమలో కూర్చొవడం వల్ల కలిగే ప్రభావం తరచూ సిగరెట్లు తాగడంతో సమానమట. దీనికి చెక్‌ పెట్టాలంటే...

Updated : 05 Feb 2022 05:22 IST

‘కూర్చొనే ఉండటం అనేది కొత్తరకం ధూమపానంలాంటిది’ అని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. ఉద్యోగరీత్యా ఏడెనిమిది గంటలు ఒకే భంగిమలో కూర్చొవడం వల్ల కలిగే ప్రభావం తరచూ సిగరెట్లు తాగడంతో సమానమట. దీనికి చెక్‌ పెట్టాలంటే... అరగంటకోసారి అయిదు నిమిషాలు లేచి నడవాలి. దాంతోపాటు రోజూ ఈ వ్యాయామాలు చేయాలి.

స్పైనల్‌ ట్విస్ట్‌... ఈ వ్యాయామం వల్ల వెన్నుపాము, దాని పరిసరాల కండరాలకు ఆరోగ్యం చేకూరుతుంది. అలాగే భుజాలు, మెడ కండరాలు ఫ్లెక్సిబుల్‌గా మారతాయి.

ఎలా చేయాలంటే.. మ్యాట్‌పై వెల్లకిలా పడుకుని చేతులను బార్లా చాపి వీలైనంత మటుకు ఒక కాలిని పూర్తిగా నేలకు తాకిస్తూ రెండో కాలిని మోకాలి వరకు మడిచి దాన్ని నేలకు తాకించే ప్రయత్నం చేయాలి. ఈ స్థితిలో కాసేపుండి విశ్రాంతి తీసుకోవాలి. అలాగే రెండో కాలితోనూ చేయాలి.

చెస్ట్‌ ఒపెనర్‌... నిటారుగా కూర్చొని చేతులను వెనక్కి మడిచి కలిపి పెట్టాలి. తలను కిందికి వంచి చేతులను మెల్లిగా వీలైనంత పైకి ఎత్తాలి. ఈ భంగిమ కొన్ని క్షణాలుండి ఆ తర్వాత విశ్రాంతి తీసుకోవాలి. ఈ విధంగా నాలుగైదుసార్లు చేయాలి. ఈ వ్యాయామం వల్ల వీపు, భుజాల కండరాలు చక్కటి స్థితిస్థాపకతను సంతరించుకుంటాయి.

లాంజ్‌ స్ట్రెచ్‌... దీన్నివల్ల తొడలు, తుంటి దగ్గర ఉండే కండరాలు మరింత దృఢంగా, ఆరోగ్యంగా మారతాయి.

నిటారుగా నిల్చొవాలి. ఆ తర్వాత ఒక కాలిని మోకాలి వరకు మడిచి నిలువుగా పెట్టాలి. రెండో కాలిని మెల్లిగా వెనక్కి జరపాలి. కావాలనుకుంటే మీ చేతులను మోకాలిపై పెట్టుకోవచ్చు. ఈ స్థితిలో కాసేపు ఉండి ఆ తర్వాత విరామం తీసుకోవాలి. ఆ తర్వాత మళ్లీ చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్