ఆ నొప్పులకు అల్లం

సంప్రదాయ వంటల నుంచి ఆధునిక రుచుల వరకూ అన్నింట్లోనూ కాస్తైనా అల్లం చేర్చాల్సిందే. అప్పుడు చక్కటి రుచి రావడమే కాదు... ఆరోగ్యానికీ ఎంతో మేలు.

Updated : 06 Jan 2023 06:08 IST

సంప్రదాయ వంటల నుంచి ఆధునిక రుచుల వరకూ అన్నింట్లోనూ కాస్తైనా అల్లం చేర్చాల్సిందే. అప్పుడు చక్కటి రుచి రావడమే కాదు... ఆరోగ్యానికీ ఎంతో మేలు. మరి ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...

* నెలసరి సమయంలో అల్లం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు నియంత్రణలో ఉంటాయట. అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని చెబుతున్నాయి పలు అధ్యయనాలు. ఆయుర్వేదం ప్రకారం అల్లానికి రక్తపోటుని నియంత్రించే శక్తి ఉంది. కడుపు ఉబ్బరాన్ని, గ్యాస్‌ సంబంధిత సమస్యల్నీ అదుపులో ఉంచుతుంది.

* పండ్ల రసంలో చిన్న అల్లం ముక్క వేసుకుని తాగి చూడండి. వికారం తగ్గుతుంది. పైత్యం అదుపులో ఉంటుంది. ఇందులో సహజంగా ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులూ, నొప్పుల్ని అదుపులో ఉంచుతాయి. శరీరాన్ని డీటాక్సిఫై చేసే శక్తి... అల్లానికే ఉంది. రోజూ ఓ చిన్న ముక్క తీసుకుంటే బరువూ అదుపులో ఉంటుంది. 

* వ్యాధినిరోధక శక్తి పెరగాలన్నా,  జలుబు, దగ్గు, శ్వాస ఇబ్బందులు అదుపులోకి రావాలన్నా అల్లాన్ని ఆహారంలో భాగం చేసుకోవాలి. రోజూ చిన్న అల్లం ముక్కల్ని గ్లాసు నీళ్లల్లో వేసి మరిగించి దానికి చెంచా తేనె కలిపి తాగితే  జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్