ఇంటిలోనే వ్యాయామం...

ఏ అమ్మాయికి ఉండదు సన్నగా నాజుగ్గా ఉండాలని. దానికోసం జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంటాం. కానీ కొందరికి అంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇంటిలో రోజూ చేసే పనులతో వ్యాయామాలను పొందొచ్చు అదెలా అంటే...

Published : 17 Mar 2024 01:59 IST

ఏ అమ్మాయికి ఉండదు సన్నగా నాజుగ్గా ఉండాలని. దానికోసం జిమ్‌కి వెళ్లి కసరత్తులు చేస్తుంటాం. కానీ కొందరికి అంత సమయం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇంటిలో రోజూ చేసే పనులతో వ్యాయామాలను పొందొచ్చు అదెలా అంటే...

  • పొద్దునే లేచినవెంటనే ఇంటిపని, వంటపని అంటూ అటూ ఇటూ పరుగులు పెడుతుంటారు. ఎంత పనిఉన్నా దాన్ని పక్కన పెట్టి మీకోసం ఒక పదినిమిషాలు కేటాయించుకొని యోగాసనాలు వేసేందుకు ప్రయత్నం చేయండి. లేదా ఒంటినిండా చెమటలు పట్టేలా ఎండలో కాసేపు గార్డెనింగ్‌ చేయండి. దానివల్ల శరీరంలో అదనపు కొవ్వు నెమ్మదిగా ఖర్చువుతూ శరీరం సన్నగా తయారవుతుంది.
  • ఈరోజుల్లో ఫోన్‌ వాడని వారు ఉండరు.గంటల కొద్దీ వీడియోలు చూడటం, మాట్లాడం చేస్తుంటారు. ఇదే పని కాస్త అటు ఇటూ నడుస్తూ చేయడం వల్ల ఇది మంచి వ్యాయామంలా ఉంటుంది.అంతేకాకుండా జీర్ణక్రియ వ్యవస్థ మెరుగుపడుతుంది. బరువు తగ్గేందుకు సాయపడుతుంది. కొందరికి చూయింగ్‌ గమ్‌ నమిలే అలవాటు ఉంటుంది. ఇది మంచిదే అంటున్నారు నిపుణులు.
  • చాలామందికి భోజనం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉంటుంది. దీని వల్ల తొందరగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందుకే రాత్రి నిద్రపోయే రెండు గంటల ముందు భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. లేదా తిన్న తర్వాత కాసేపు నడిస్తే మంచిది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్