నెలసరి నొప్పికి చిట్కాలు..

కొంతమంది మహిళల్లో పీరియడ్‌ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుంది. దాన్ని తగ్గించేందుకు పెయిన్‌ కిల్లర్స్‌నీ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించదు.

Published : 26 Mar 2024 01:55 IST

కొంతమంది మహిళల్లో పీరియడ్‌ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుంది. దాన్ని తగ్గించేందుకు పెయిన్‌ కిల్లర్స్‌నీ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించదు. మరి వంటింటి చిట్కాలతోనే నొప్పిని ఎలా తగ్గించుకోవాలో చూద్దామా..

  • నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కోసం మసాజ్‌ థెరపీ చక్కగా సాయపడుతుంది. దానికోసం లావెండర్‌్, రోజ్‌, లవంగం, దాల్చినచెక్క వంటి ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది. వీటిలో కొద్దిగా కొబ్బరి నూనెను కలిపి పొత్తికడుపుపై రాసి, మసాజ్‌ చేసుకుంటే నొప్పి తగ్గుతుంది.
  • నెలసరి నొప్పిని తగ్గించే వాటిలో విటమిన్‌-సి పదార్థాలు ఒకటి. అందుకే ఆ సమయంలో కమలా, నిమ్మకాయ, ఆరెంజ్‌ వంటివి తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్‌- డి కూడా నొప్పి బాధని తగ్గిస్తాయి.
  • ఈ సమయంలో వ్యాయామానికి దూరంగా ఉంటారు. కానీ తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదు, ఎండార్ఫిన్‌లూ విడుదలవుతాయి. దీంతో తిమ్మిరి కూడా తగ్గుతుంది.
  • అల్లం టీ వంటి హెర్బల్‌ టీలు తాగితే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు నొప్పిని తగ్గిస్తాయి. కొన్నిసార్లు కడుపుబ్బరం వల్ల కూడా నొప్పి తీవ్రమవుతుంటుంది. ఇలాంటప్పుడు గోరువెచ్చటి నీళ్లు తాగితే రక్తప్రసరణ మెరుగై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్