తీరిక లేకున్నా వ్యాయామం ఇలా...

చక్కని ఆరోగ్యానికి వ్యాయమం అన్నివిధాలా రక్ష. అయితే చాలామంది మాకస్సలు తీరికే ఉండదు అంటారు. ఇంటిపనులు....

Updated : 09 Dec 2022 13:35 IST

చక్కని ఆరోగ్యానికి వ్యాయమం అన్నివిధాలా రక్ష. అయితే చాలామంది మాకస్సలు తీరికే ఉండదు అంటారు. ఇంటిపనులు చేసుకుంటూనే తగిన వ్యాయామం చేసిన ఫలితాన్ని పొందవచ్చు. ఎలాగంటే....

* ఇల్లు శుభ్రం చేసే పని ఉంటుంది. ఇలాంటప్పుడు కాలి మునివేళ్లపై నిలబడి చేతులు పైకెత్తి అల్మారాలను శుభ్రపరచండి. మధ్యమధ్యలో విశ్రాంతినిస్తూ... పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఇలా చేసేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి సాగేతత్వం అలవడుతుంది. అల్మారాలూ శుభ్రమౌతాయి. అంటే..., ఒకేసారి రెండింటికి పరిష్కారం లభిస్తుంది.

* రోజూ ఉదయాన్నే దంతధావనం తర్వాత అద్దంలో చూస్తూ పెద్దగా నవ్వండి. నిటారుగా నిలబడి వెనక్కి తలను వంచి ఇంటి పైకప్పును చూస్తూ ఓ పది సార్లు పెద్దగా నోరు తెరవడం, మూయడం చేస్తుండాలి. దీని వల్ల డబుల్‌చిన్‌ సమస్య దూరమవుతుంది. మెడనొప్పులు, స్పాండిలైటిస్‌ సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాల్సిందే.

* గంటలు గంటలు ఫోన్‌లు, ఛాటింగ్‌లు, నెట్‌ బ్రౌజింగ్‌ మనలో చాలామందే చేస్తుంటారు. ఇలాంటప్పుడు పడుకుని, కూర్చుని మాట్లాడొద్దు. వీలైనంతవరకూ అటూ ఇటూ నాలుగు అడుగులు వేస్తూ ఉంటే మంచిది. అతిగా టీవీ చూస్తే వూబకాయం పెరుగుతుందని అనేక అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి. దీనికి కారణం కదలకుండా కూర్చోవడం, ఆయా కార్యక్రమాల్లో లీనమైపోతూ మితిమీరి తినడం వంటివి. మరి అలాకాకుడదనుకుంటే...ఈ సారి టీవీ చూసేప్పుడు రిమోట్‌ చేతిలో పెట్టుకోవద్దు. టీవీ దగ్గరే ఉంచితే...ఛానల్‌ మార్చాలనుకున్నప్పుడల్లా లేచి నాలుగడుగులు వేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్