వధువుకి... నమస్కారం!

ఆడపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు ఆమెకు ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చామా, చీరసారెల్లో ఏ లోపం లేదుకదా.. ఇవే కదా ఆలోచిస్తాం. కానీ గుజరాత్‌లోని కచ్‌  పటేల్‌ కుటుంబాల్లో మరో ఆచారాన్ని కూడా అనుసరిస్తారు.

Published : 16 Mar 2024 01:49 IST

అవునా?!

డపిల్లని అత్తారింటికి పంపేటప్పుడు ఆమెకు ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చామా, చీరసారెల్లో ఏ లోపం లేదుకదా.. ఇవే కదా ఆలోచిస్తాం. కానీ గుజరాత్‌లోని కచ్‌  పటేల్‌ కుటుంబాల్లో మరో ఆచారాన్ని కూడా అనుసరిస్తారు. ‘ఇన్నేళ్ల నీ పెంపకంలో ఏదైనా పొరపాటు జరిగిందా?, నీ మనసు నొప్పించేలా ఎప్పుడైనా ప్రవర్తించామా’ అని పెళ్లికూతుర్ని అడుగుతారట. అది కూడా ఊరకనే మాట వరసకి కాదు... కాళ్లకు నమస్కారం చేసి మరీ అడుగుతారు. ఈ పనిని కేవలం అమ్మానాన్నలు మాత్రమే కాదు.. తాతయ్యలు, బాబాయ్‌లు, పెదనాన్నలు, పెద్దమ్మలు, తమ్ముళ్లు ఇలా వయసుతో సంబంధం లేకుండా ఆ ఇంట్లో అందరూ వధువు కాళ్లకు నమస్కరించి ఒక వేళ పొరపాటు చేస్తే క్షమించు అని అడుగుతారట. వాళ్లంత కాకపోయినా ఈ మధ్యకాలంలో వధువు వరుడికి పాదనమస్కారం చేసినట్టే... పెళ్లికొడుకూ ఆమెకి నమస్కారం చేసి గౌరవం ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి అంటూ సరికొత్త ఆచారానికి నాంది పలుకుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్