అవి అభద్రతకు బీజం వేస్తాయి!

ఇంట్లో ఒకరికిమించి పిల్లలు ఉన్నప్పుడు... చిన్నదానికీ, పెద్దదానికీ తగవులే. అన్నింటికీ కారణాలు ఉండవు. అలాగని వారిని సర్దుబాటు చేయకపోతే మాత్రం... వారి చిన్ని మనసుల్లో అభద్రతకు బీజం వేస్తాయి.

Published : 20 Mar 2024 01:28 IST

ఇంట్లో ఒకరికిమించి పిల్లలు ఉన్నప్పుడు... చిన్నదానికీ, పెద్దదానికీ తగవులే. అన్నింటికీ కారణాలు ఉండవు. అలాగని వారిని సర్దుబాటు చేయకపోతే మాత్రం... వారి చిన్ని మనసుల్లో అభద్రతకు బీజం వేస్తాయి. అలాకాకూడదంటే..

  • పిల్లలన్నాక కలిసి ఆడుకోవడం, పోట్లాడుకోవడం మామూలే. అలాగని అన్నిసార్లూ చూసీ చూడనట్లు వదిలేయలేం. ఎందుకంటే... వారిలో ఒకరే ఎప్పుడూ అజమాయిషీ చేయడం, మరొకరు అన్నింటికీ తగ్గి ఉండటం మంచిది కాదు. ఇందుకు తమకు నచ్చిన వాటిని సొంతం చేసుకోవాలన్న పంతమో, అందరి దగ్గర మంచి అనిపించుకోవాలన్న స్వార్థమో కారణం కావొచ్చు. దాన్ని తల్లిగా మీరు గుర్తించండి. చిన్న వయసులోనే సరి చేయండి. పిల్లల ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వడమే కాదు... మంచి, చెడులను సమంగా స్వీకరించేలా చేయండి. పంచుకోవడం నేర్పించాలి.
  • ఒకే వయసు పిల్లలైనా వారి ఆలోచనలు ఒకలా ఉండకపోవచ్చు. ఎప్పుడూ ఒకరినే వెనకేసుకురావడం, తప్పొప్పులు గమనించకుండానే నువ్వే పొరబాటు చేసుంటావని నిర్ణయించే మీ తీరు మార్చుకోండి. వెనకబడ్డవారికి చేయూతనివ్వడం, తోటివారికి ప్రోత్సాహం ఇవ్వడంలో కలిగే ఆనందాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పండి. అప్పుడు ఒకరికొకరు తోడుగా ఉండగలరు.
  • కొన్నిసార్లు పిల్లలు అతిగా ప్రవర్తించడానికి మీరు వ్యవహరించే తీరూ కారణం కావొచ్చు. అదెలాగంటారా? చిన్నపిల్లాడనో లేక ఇంట్లో ఒక్కతే ఆడపిల్లనో అతిగారాబం చేస్తుంటారు. ఎలాగూ పెద్దోడు కాస్త బలంగా ఉన్నాడు కదా అని చిన్నోడిపై అతిశ్రద్ధ చూపిస్తూ ఉండొచ్చు. దీన్ని చనువుగా తీసుకుని వారు... నిర్లక్ష్యం చేస్తున్నారని భావించి మిగిలిన వారు ఇతరులపై గొడవలకు సిద్ధమైపోతుంటారు. అందుకే మీరు ప్రేమను ఇద్దరికీ సమానంగా పంచండి. వారూ కలిసి సాగుతారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్