అప్పుడు ఎవరైనా రారాణే!

మూడేళ్ల వయసులో టెన్నిస్‌ రాకెట్‌ పట్టా. చిన్నతనంలో కాంప్టన్‌లో ఉండేవాళ్లం. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో.. ఎక్కడ్నుంచి బుల్లెట్‌ దూసుకొస్తుందోనన్న భయం ఉండేది. ఆ పరిస్థితుల్లోనే నాన్న శిక్షణకు తీసుకెళ్లేవారు.

Published : 10 Jul 2023 00:11 IST

సెరెనా విలియమ్స్‌, టెన్నిస్‌ క్రీడాకారిణి

మూడేళ్ల వయసులో టెన్నిస్‌ రాకెట్‌ పట్టా. చిన్నతనంలో కాంప్టన్‌లో ఉండేవాళ్లం. ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి జరుగుతుందో.. ఎక్కడ్నుంచి బుల్లెట్‌ దూసుకొస్తుందోనన్న భయం ఉండేది. ఆ పరిస్థితుల్లోనే నాన్న శిక్షణకు తీసుకెళ్లేవారు. భయం భయంగా ఆడుతోంటే.. ‘నీకు సమీపంలో తుపాకీ పేలినా శబ్దం వినపడనట్లుగా ఆడగలగాలి. అదీ దృష్టి పెట్టడమంటే.. అలా ఆడి చూడు విజయం నీ సొంతం’ అని సలహానిచ్చారు నాన్న. ఆ సూత్రాన్ని కెరియర్‌ అంతటా పాటిస్తూ వచ్చా. ఈక్రమంలో లింగ, జాతి వివక్ష వంటివెన్నో ఎదుర్కొన్నా. ‘అవతలి వ్యక్తి నీ కంటే గొప్ప క్రీడాకారిణి’, ‘కండలతో మగరాయుడిలా తయారవుతున్నావ్‌.. నిన్నెవరూ ఇష్టపడరు’, ‘అమ్మయ్యింది.. ఇక సెరెనా పని అయిపోనట్లే..’ ప్రతి దశలోనూ ఇలాంటి మాటలెన్నో! నేను మాత్రం.. ‘చివరి బంతి వరకూ ఓటమిని ఒప్పుకోవద్దు’, ‘నాపై నాకు నమ్మకం ఉంది. ఎదుటివారి మాటలను పట్టించుకోవాల్సిన పనిలేదు’, ‘ఆత్మవిశ్వాసమే ఆకర్షణ’, ‘ఓటమి ఒక దశ.. ప్రయత్నిస్తే దాన్ని దాటడం తేలికే’.. ఇలా నాకు నేను సర్ది చెప్పుకొనేదాన్ని. వేరొకరి మాటలు, నియమాలు నేను పట్టించుకోవాలి, అనుసరించాలని అనుకోలేదెప్పుడు. కాబట్టే.. శారీరకంగానే కాదు.. మానసికంగానూ దృఢంగా ఉంటూ ‘టెన్నిస్‌ రారాణి’ అనిపించుకున్నా. ఒకరి అభిప్రాయాలను పట్టించుకోకుండా మీపై మీరు ఆత్మవిశ్వాసం ఉంచండి. సొంత నియామాలు సృష్టించుకొని పాటిస్తూ సాగండి. మీరూ ఎంచుకున్న రంగంలో రారాణి అవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని