ఉపవాసం ఉంటే.. తినొద్దు

పూజలు, వ్రతాలకు మన మహిళల్లో చాలామంది ఉపవాసం ఉంటుంటారు. కొందరు వారంలో ఒకరోజు తప్పక చేస్తుంటారు.

Updated : 17 Oct 2023 18:01 IST

పూజలు, వ్రతాలకు మన మహిళల్లో చాలామంది ఉపవాసం ఉంటుంటారు. కొందరు వారంలో ఒకరోజు తప్పక చేస్తుంటారు. ఇది ఆరోగ్యానికీ జీర్ణవ్యవస్థకీ మేలు చేసేదే! అయితే ఆ ప్రయోజనాలు అందాలంటే ఉపవాసం విరమించేప్పుడూ కొన్నింటికి దూరంగా ఉండాలి. అవేంటంటే..

  • మసాలా... రోజంతా ఏమీ తినకపోవటం వల్ల ఆకలి సహజమే! సువాసన ఆకర్షిస్తోంటే నచ్చిన వాటివైపు మనసు లాగుతుంటుంది. అలాగని నూనె, మసాలాతో కూడిన ఆహారం జోలికి వెళ్లొద్దు. జీర్ణాశయం అరిగించుకోలేక ఇబ్బంది పడుతుంది. ఫలితమే కడుపునొప్పి, అజీర్తి వంటి సమస్యలు. కాబట్టి, అలాంటి వాటికి దూరంగా ఉండాలి.
  • పుల్లనివి... కొందరు ఈ సమయంలో పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో పుల్లని పండ్లను తీసుకోకూడదు. నిమ్మ, చింతపండుతో చేసిన వంటకాలకూ దూరంగా ఉంటే మేలు. ఇవి కడుపులో ఎసిడిటీతోపాటు మరికొన్ని సమస్యలను తెస్తాయి. కావాలనుకుంటే జామ, యాపిల్‌, దోసకాయ, పుచ్చకాయ వంటివి తినండి. కడుపుబ్బరం సమస్య ఉండదు.
  • కాఫీ, టీ... చాలామంది శక్తి కోల్పోవద్దని, తోచక టీ, కాఫీ   తాగేస్తుంటారు. ఇవి ఆకలిని అడ్డుకునే మాట వాస్తవమే. కానీ.. ఖాళీ కడుపుతో తీసుకుంటే జీర్ణవ్యవస్థకే హాని చేస్తాయి. బదులుగా పండ్ల రసాలు, పాలు వంటివి తాగటం మంచిది.
  • స్వీట్లు... చాలామంది ఉపవాస విరమణ తీపిపదార్థాలతోనే చేస్తారు. వీటిని ఎక్కువగా తింటే తలనొప్పి, కడుపులో తిప్పడం, అజీర్తి వంటి సమస్యలొస్తాయి. వీలైనంతవరకూ సాత్విక ఆహారానికే ప్రాధాన్యమివ్వండి. అప్పుడు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్