ఈ అలవాట్లకుస్వస్తి పలికితేనే...

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు దైనందిన జీవితంలో తెలిసీతెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్లు, అలవాట్లు లక్ష్యానికి దూరం చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటికి స్వస్తి పలికితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు అని చెబుతున్నారు.

Published : 18 Jan 2022 00:57 IST

ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు దైనందిన జీవితంలో తెలిసీతెలియకుండా చేసే చిన్నచిన్న పొరపాట్లు, అలవాట్లు లక్ష్యానికి దూరం చేస్తాయి అంటున్నారు నిపుణులు. వీటికి స్వస్తి పలికితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించొచ్చు అని చెబుతున్నారు.

ఫిర్యాదులొద్దు... మీ సమస్యలపై మీరు ఫిర్యాదు చేసుకోవద్దు. అలా సమయాన్ని వృథా చేయొద్దు. ఫలానా సమస్య ఇంతగా బాధిస్తోందంటూ గంటల తరబడి ఆలోచించడం లేదా ఇతరులకు దాని గురించి ఏకరవు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అదే సమయాన్ని ఆ సమస్య పరిష్కారం కోసం వినియోగిస్తే చాలు. త్వరగా బయటపడొచ్చు.
మరోసారి అనొద్దు... ఏదైనా పనిచేయాల్సి వచ్చినప్పుడు మరోసారి చూద్దాం అని వాయిదా వేయకూడదు. చిన్నదైనా, పెద్దదైనా తక్షణం ఆ పని గురించి ఆలోచించి త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. చేయలేని పక్షంలో కనీసం దాని గురించి అవగాహన పొందగలిగితే చేయాలనే ఆసక్తి దానికదే వస్తుంది. అలా ఎప్పటి పని అప్పుడే పూర్తి చేస్తే భారం తగ్గుతుంది. ఒత్తిడి ఉండదు.
అన్నింటికీ ‘ఎస్‌’ చెప్పొద్దు... ఎదుటి వారు చెప్పే ప్రతి దానికీ ఎస్‌ అంటూ ఒప్పుకోకూడదు. అది మీరు చేయగలిగితేనే అలా చెప్పండి. లేదంటే సున్నితంగా మీ వల్ల కాదని ముందే చెబితే మంచిది. మీకంటూ కొన్ని పరిధిలుంటాయి. వాటిని పాటించాలి. అన్నింటికీ ఎదుటివారితో కలిసి నడవడానికి ప్రయత్నిస్తే మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
భయపడొద్దు... వైఫల్యాలెదురైతే భయపడి అక్కడితో ఆగిపోవద్దు. ముందుకు ప్రయాణిస్తేనే విజయం. అప్పుడే దానివల్ల దక్కే మానసిక తృప్తిని రుచి చూసే అవకాశం దొరుకుతుంది. లేదంటే విజయం ద్వారా దొరికే సంతోషాన్ని కోల్పోయినవారవుతారు. అలాగే మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని నియంత్రించాలనుకోవద్దు. అలా చేస్తే చివరికి ఒంటరివారవుతారు. ఎదుటి వారికి స్వేచ్ఛనిస్తే అందరూ మీ చుట్టూనే ఉంటారు.
ప్రతికూలత వద్దు... ఈ ఆలోచనలకు చోటివ్వద్దు. ఎంతటి సమస్యనైనా సానుకూలతగా తీసుకోవడం నేర్చుకోవాలి. ఆ దిశగా లభ్యమయ్యే విజయాలను గుర్తుకు తెచ్చుకుంటే చాలు. ప్రతికూలత దరికి చేరదు. అలాగే ఎదుటి వారివల్ల చిన్న సహాయం పొందినా కృతజ్ఞత చెప్పడం మరవకూడదు. అందులో ఎంతో సంతోషం దాగి ఉంటుంది.
లక్ష్యం...
మీ ఎదుట నిత్యం ఏదో ఒక లక్ష్యం ఉండాల్సిందే. అది చిన్నదైనా, పెద్దదైనా ఫరవాలేదు. పట్టికలా రాసుకుని వాటిని తరచూ చూస్తూ ఉండాలి. వాటిని ఛేదించడానికి నిత్యం చేసే ప్రయత్నం శారీరక, మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది. ఎటువంటి లక్ష్యం లేకుండా వేసే అడుగులు ఎక్కువ దూరం ప్రయాణించ లేవు. దాంతో మనసంతా నిరాసక్తత ఆవరిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్