పొరబాటు చేయొద్దనుకుంటున్నా!

మా ముంబయి శాఖలో పని చేయాలని నా కోరిక. నా నెట్‌వర్క్‌ ద్వారా అక్కడ ఖాళీలున్నాయని తెలిసింది. దానికి నా అర్హతలు సరిగ్గా సరిపోతాయి. విషయం తెలిసినప్పటి నుంచీ చాలా ఆనందంగా ఉంది.

Published : 10 Feb 2022 00:12 IST

మా ముంబయి శాఖలో పని చేయాలని నా కోరిక. నా నెట్‌వర్క్‌ ద్వారా అక్కడ ఖాళీలున్నాయని తెలిసింది. దానికి నా అర్హతలు సరిగ్గా సరిపోతాయి. విషయం తెలిసినప్పటి నుంచీ చాలా ఆనందంగా ఉంది. పైగా సంస్థ అంతర్గత ఉద్యోగులకూ దరఖాస్తు చేసుకోడానికి అనుమతిస్తుంది. పైగా అరుదైన అవకాశం. బయటి నుంచీ పోటీ ఉంటుంది. కాబట్టి, పొరబాటు చేయదలచుకోవట్లేదు. ఏం జాగ్రత్తలు తీసుకుంటే మేలు?

- కల్పన, దిల్లీ

ముందు మిమ్మల్ని మీరు బయటి వ్యక్తిగానే భావించండి. మీ ఉద్దేశం మెరుగైన హోదా, మంచి జీతం కావొచ్చు. కానీ బయటి అభ్యర్థులు నిరుద్యోగ స్థితి నుంచి బయటపడటానికి చూస్తుంటారు. కాబట్టి వాళ్లలో ప్రేరణ ఎక్కువ. అందుకే ప్రతి దానిలోనూ సిద్ధమై ఉంటారు. రిక్రూటర్ల ప్రవర్తన నుంచి తమ బలహీనతలనూ బలంగా చూపించడం వరకు ప్రతి దానిపై వారికి అవగాహన ఎక్కువే. ఇక మీరు.. ఉద్యోగి, మీ బలాలు, బలహీనతలపై తోటివారికి అవగాహన ఉంటుంది. మీ సహోద్యోగులూ దీనికి ప్రయత్నిస్తుంటే వాళ్లు పేరు ప్రస్తావించకుండానే మీకంటే తామెంత మెరుగో చెప్పగలరు. అది మీపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు. కాబట్టి, ముందే ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోకండి.

అనుభవం దృష్ట్యా నైపుణ్యాలపై నమ్మకంతో ఉండుంటారు. ఈ రోజుల్లో సాఫ్ట్‌ స్కిల్స్‌కు విలువెక్కువ. ఇది బయటి పోటీదారులకు బాగా తెలుసు. శిక్షణా తీసుకునుంటారు. మీరూ మీ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, టీమ్‌ వర్క్‌, ఇతర సాఫ్ట్‌ స్కిల్స్‌ గురించి మాట్లాడేలా సిద్ధమవండి. పుస్తకాలు చదవడమో, శిక్షణ తీసుకోవడమో చేయండి. రెజ్యూమెను అప్‌డేట్‌ చేసుకోండి. మీ విజయాలు వివరంగా ఉంచడంతోపాటు దరఖాస్తు చేసుకున్న హోదాకు మీరు తగినవారని చూపేలా సిద్ధం చేసుకోండి. ఇంటర్వ్యూనూ తేలిగ్గా తీసుకోవద్దు. ప్రశ్నావళిని, దానికి జవాబులను సిద్ధం చేసుకోండి. మాక్‌ ఇంటర్వ్యూల్లో పాల్గొనండి. డ్రెస్‌కోడ్‌ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకోండి. పనిచేసే చోటును శుభ్రంగా ఉంచడం, సమావేశాల్లో మాట్లాడటం, పరిష్కారాలు సూచించడం, ప్రాజెక్టును ముందుకొచ్చి స్వీకరించడం వంటివి చేయండి. ఇప్పుడనే కాదు.. భవిష్యత్‌లోనైనా కెరియర్‌లో ముందుకు సాగాలంటే ఈ లక్షణాలను కొనసాగించండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్