సులువైన ముద్రతో ప్రయోజనాలెన్నో

ఎండల తీవ్రతకు తల తిరగడం, ఆకలి మందగించడం లాంటి సమస్యలు మామూలే. ఇలాంటి ఇబ్బందులకు మందులు వేసుకోవడం కంటే యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. భైరవి ముద్రతో వేసవి వేడి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ఊబకాయులకు కూడా ఈ ముద్ర తేలికే.

Updated : 07 May 2022 04:58 IST

ఎండల తీవ్రతకు తల తిరగడం, ఆకలి మందగించడం లాంటి సమస్యలు మామూలే. ఇలాంటి ఇబ్బందులకు మందులు వేసుకోవడం కంటే యోగా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. భైరవి ముద్రతో వేసవి వేడి నుంచి మనల్ని మనం కాపాడుకుందాం. ఊబకాయులకు కూడా ఈ ముద్ర తేలికే.

భైరవి ముద్రకు సౌకర్యవంతంగా కూర్చోవాలి. సుఖాసనమా, పద్మాసనమా, వజ్రాసనమా అనేది మీ ఇష్టం. ఎందులో మీరు ఇబ్బంది పడకుండా కూర్చోగలరో, దాన్ని ఎంచుకోండి. నడుం మాత్రం వంగకుండా నిటారుగా ఉండేలా చూసుకోండి. రెండు చేతులనూ ఒళ్లో ఉంచి ఒక అరచేతిలో ఇంకో అరచేయి పెట్టి ఉంచాలి. కుడి చేయి పైన, ఎడమ చేయి కింద ఉండాలి. కళ్లు మూసుకుని నెమ్మదిగా శ్వాస తీసుకుని వదులుతూ దాని మీదే ధ్యాస ఉంచాలి. ఏవైనా ఆలోచనలు వచ్చినా గ్రహించగానే దృష్టి మళ్లించి, శ్వాసనే గమనిస్తుండాలి. కనీసం ఆరు నిమిషాల పాటు ఈ భైరవి ముద్రలో కూర్చోగలిగితే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ముద్ర పాటించడం వల్ల మనసు, శరీరం రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఎండ తీవ్రతకు కళ్లు మండటం, తల తిరగడం, ఆకలి వేయకపోవడం, భోజనం సహించకపోవడం, తిన్నది అరగకపోవడం, గాలి ఆడనట్లుండటం, అతిగా చెమట పట్టడం, తలనొప్పి- లాంటి వేసవిలో వచ్చే రకరకాల సమస్యలకు ఇది విరుగుడుగా పనిచేస్తుంది. ఇతర కాలాల్లోనూ ఈ ముద్ర మంచిదే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్