పిల్లలకి ఏం వాడాలి?

పాపకి ఏడేళ్లు. ముఖం బాగా పొడిబారుతోంది. బుగ్గపై ఏదో మందంగా తగులుతున్నట్లుగా వచ్చింది. ఏంటది? పిల్లలకీ మాయిశ్చరైజర్‌ రాయాలా? వాడాల్సొస్తే ఏం వాడాలి? వాటిల్లో ఏముండాలి?

Published : 19 Mar 2023 00:11 IST

పాపకి ఏడేళ్లు. ముఖం బాగా పొడిబారుతోంది. బుగ్గపై ఏదో మందంగా తగులుతున్నట్లుగా వచ్చింది. ఏంటది? పిల్లలకీ మాయిశ్చరైజర్‌ రాయాలా? వాడాల్సొస్తే ఏం వాడాలి? వాటిల్లో ఏముండాలి?

- సంధ్య

ఎగ్జిమా లేదా ఎపోటిక్‌ డెర్మటైటిస్‌ అయ్యుండొచ్చు. ఎర్రగా, ప్యాచ్‌లుగా ఉండి, దురద కూడా ఉంటే ఎగ్జిమా. ఇవి రెండూ చిన్నపిల్లల్లోనే ఎక్కువగా వస్తాయి. కారణాలేంటో చెప్పలేం కూడా. చలి, బాగా పొడి వాతావరణాల్లో ఎక్కువగా వస్తుంటాయి. సబ్బు వాడకం తగ్గించండి. ముఖ్యంగా సువాసనల్లేని రకాలను ఎంచుకోవాలి. పీహెచ్‌ కూడా 5- 5.5 ఉంటే మంచిది. మరీ చల్లటి, మరీ వేడి కాకుండా గోరువెచ్చని నీటితోనే స్నానం చేయించండి. అదీ త్వరగా ముగించాలి. పిల్లల దుస్తులకూ సువాసనల్లేని డిటర్జెంట్లనే వాడాలి. స్నానం పూర్తవ్వగానే మాయిశ్చరైజర్‌ తప్పక రాయాలి. పిల్లలకు క్రీములు అవసరం లేదు అనుకోవద్దు. వాళ్లకీ రక్షణ అవసరమే. సెరమైడ్స్‌, సహజ తేమను అందించే పదార్థాలున్న క్రీములు ఎంచుకుంటే మంచిది. సన్‌స్క్రీన్‌ లోషన్‌నీ తప్పక రాయాలి. అయితే వాటిలో బెంజోఫినాన్స్‌, పారాబెన్స్‌, ఎంసీఐ, ఎంఐఏ ఉండకుండా చూసుకుంటే చాలు. మినరల్స్‌ ఉన్నవి ఎంచుకుంటే ఇంకా మేలు. పిల్లలను తరచూ ముఖం కడుక్కోమనొద్దు. తప్పక కడిగినా మాయిశ్చరైజర్‌ రాయడం అలవాటు చేయండి. అప్పుడు చర్మం పొడిబారే సమస్య అదుపులోకి వస్తుంది. ఇంకా విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ రోజువారీ ఆహారంలో అందేలా చూసుకోండి. 2 లీటర్ల నీళ్లు తాగేలా ప్రోత్సహిస్తే ఈ సమస్య నుంచి బయట పడగలుగుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్