బ్రాస్‌లెట్‌ స్టైల్‌ మారింది...

దుస్తులకు తగ్గట్లుగా ఇప్పుడు బ్రాస్‌లెట్‌ నూతన ఫ్యాషన్‌ను సంతరించుకుంది. నాలుగైదు వరసల్లో చేతికి నిండుదనాన్ని అందిస్తూ కొత్త అందాన్ని తెచ్చిపెడుతోంది.

Published : 16 Jun 2021 00:38 IST

దుస్తులకు తగ్గట్లుగా ఇప్పుడు బ్రాస్‌లెట్‌ నూతన ఫ్యాషన్‌ను సంతరించుకుంది. నాలుగైదు వరసల్లో చేతికి నిండుదనాన్ని అందిస్తూ కొత్త అందాన్ని తెచ్చిపెడుతోంది. దారాల అల్లికల మధ్య వర్ణభరితమైన రాళ్లు, ముత్యాలు, అలనాటి నాణేలు ఒదిగిపోయి మెరిసిపోతున్నాయి. డ్రస్‌ రంగు, స్టైల్‌బట్టి తయారుచేస్తున్న ఈ బ్రాస్‌లెట్స్‌ ఇప్పుడు అమ్మాయిల మనసును దోచుకుంటున్నాయి. సంప్రదాయ దుస్తుల నుంచి ఆధునిక ఫ్యాషన్‌కు తగ్గట్లుగా చివర్లో గవ్వలు, ముత్యాలు, ఊలు డిజైన్లు వేలాడుతూ మ్యాచింగ్‌కు కొత్త అర్థం చెబుతున్నాయి. అంతేకాదు, ప్రత్యేక సందర్భాల్లో ధరించడానికి పూల డిజైన్లతో కఫ్‌ బ్రాస్‌లెట్స్‌తోపాటు జీన్స్‌కు జోడీగా వస్తున్న వాటికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్