పసిడి ఛాయకు పెసరపిండి...

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు...సౌందర్యపోషణ పట్ల కాస్త శ్రద్ధ పెట్టగలిగితే మరింతగా మెరిసిపోవడం సాధ్యమవుతుంది. మరి దానికోసం అందుబాటులో ఉండే పెసరపిండి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అదెలాగంటారా..

Updated : 09 Dec 2022 15:27 IST

అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు...సౌందర్యపోషణ పట్ల కాస్త శ్రద్ధ పెట్టగలిగితే మరింతగా మెరిసిపోవడం సాధ్యమవుతుంది. మరి దానికోసం అందుబాటులో ఉండే పెసరపిండి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. అదెలాగంటారా..
కొందరి ముఖం ఇట్టే జిడ్డు కారుతుంది. దానికి తోడు దుమ్ము, ధూళి వంటివి పేరుకుని ముఖం నిర్జీవంగా మారుతుంది. ఫలితంగా మొటిమల వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటప్పుడు పరిష్కారంగా మూడు చెంచాల పెసరపిండికి రెండు చెంచాల పెరుగు, చెంచా కీరదోస రసం, రెండు చుక్కల లావెండర్‌నూనె కలిపి ముఖానికి పూతలా రాయాలి. ఇలా చేస్తే చర్మం కాంతిమంతంగా మారుతుంది. మురికీ తొలగిపోతుంది.  మూడు చెంచాల పెసరపిండిలో మూడు టేబుల్‌ స్పూన్ల యాపిల్‌ గుజ్జు, చెంచా తేనె, అరచెక్క నిమ్మరసం కలిపి మెత్తని మిశ్రమంలా చేసుకోవాలి. దీన్ని రోజూ ఉదయాన్నే ముఖానికి రాసుకుని పావుగంటాగి గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకున్న నలుపుదనం పోయి తాజాగా కనిపిస్తుంది. క్రమం తప్పకుండా చేస్తుంటే ఛాయా మెరుగుపడుతుంది.  కొందరి చర్మంపై మృతకణాలు పేరుకోవడం వల్ల గరుకుగా ఉంటుంది. ఇలాంటప్పుడు పావుకప్పు పెసరపిండి, అర చెంచా బియ్యప్పిండి, కొంచెం పసుపుని గులాబీ నీటితో కలిపి మెత్తగా చేసుకోవాలి. దీన్ని ముఖానికి రాసుకుని నాలుగు నిమిషాలు ఉండనివ్వాలి. ఆపై పాలతో చేతిని తడుపుకుంటూ నలుగులా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మృతకణాలు తొలగి చర్మం నునుపుగా మారుతుంది.
కొందరికి మెడ, మోచేతులూ, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారుతుంది. ఇలాంటప్పుడు పావుకప్పు పెసరపిండికి, చెంచా నిమ్మరసం, గులాబీనీరు చేర్చి మెత్తగా చేసుకుని ఆ ప్రదేశాల్లో పూతలా వేయాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తగ్గిపోతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్