కొన్ని నిమిషాలైనా పరుగెత్తాలట..

రోజులో కనీసం కొన్ని నిమిషాలైనా పరుగెత్తగలిగితే ఎముక ఆరోగ్యం దృఢంగా ఉంటుందని చెబుతోంది ఓ అధ్యయనం. యూనివర్శిటీ ఆఫ్‌ ఎక్స్‌టెర్‌ చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. మహిళలు సగటున రోజూ ఇరవై నుంచి నూట అరవై సెకెన్ల చొప్పున పరుగెత్తడం తప్పనిసరి.

Updated : 09 Dec 2022 13:42 IST

రోజులో కనీసం కొన్ని నిమిషాలైనా పరుగెత్తగలిగితే ఎముక ఆరోగ్యం దృఢంగా ఉంటుందని చెబుతోంది ఓ అధ్యయనం. యూనివర్శిటీ ఆఫ్‌ ఎక్స్‌టెర్‌ చేసిన ఈ అధ్యయనం ప్రకారం.. మహిళలు సగటున రోజూ ఇరవై నుంచి నూట అరవై సెకెన్ల చొప్పున పరుగెత్తడం తప్పనిసరి. అంతేకాదు రెండు నిమిషాల కంటే ఎక్కువ సమయం పరుగెత్తేవారిలో ఎముకలు ఆరురెట్లు దృఢంగా ఉంటాయట. వయసు మళ్లాక ఇబ్బందిపెట్టే ఆస్టియోపోరోసిస్‌ వచ్చే ప్రమాదం చాలామటుకూ తగ్గుతుంది. బరువులెత్తే వ్యాయామాలతో పోల్చినప్పుడు దీనివల్ల ఎంతో మేలు జరుగుతుంది. సుమారు రెండువేల ఐదువందలమందిపై చేసిన ఈ అధ్యయనంలో రోజూ ఎంతసేపు మహిళలు పరుగెడుతున్నారూ.. అది ఎముక ఆరోగ్యాన్ని ఏ విధంగా దృఢంగా ఉంచుతోందో పోల్చి చూశారు. దాని ఆధారంగానే ఈ ఫలితాలువెల్లడించారు. నడకతో మొదలుపెట్టి... క్రమంగా పరుగుతీస్తే దీనికి అలవాటు పడతారనీ సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్