బ్రేకింగ్

breaking
18 Jan 2022 | 11:47 IST

ఆ రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు: జగన్‌

తాడేపల్లి: 37గ్రామాల్లో భూముల రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభించామని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ఆయన వర్చువల్‌గా ప్రారంభించి మాట్లాడారు. ‘‘ ఇంటి స్థలం, పొలాలు.. రికార్డుల్లో ఒకలా.. రిజిస్ట్రేషన్‌లో వేరేలా ఉంటున్నాయి. భూముల వద్దకు వెళ్తే కొలతల్లో తేడా ఉంటుంది. సివిల్‌ వివాదాలకు స్వస్తి పలకాలన్నదే లక్ష్యం. ఆక్రమణలు, కబ్జాలు, నకిలీ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేస్తున్నాం. సర్వే చేసేటప్పుడు భూ యజమానిని భాగస్వామ్యం చేస్తున్నాం. 2023నాటికి రాష్ట్రంలోని ప్రతి భూమిని సమగ్ర ఆధునిక పద్ధతుల్లో రీసర్వే చేస్తాం. భూ యజమానికి తెలియకుండా రికార్డులు మార్చే ప్రసక్తే ఉండదు’’ అని జగన్‌ తెలిపారు.

మరిన్ని

తాజా వార్తలు