close
అవీ.. ఇవీ..
సంక్రాంతి మెరుపు తీగలు వీళ్లే...

టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో నిలిచే సినిమాలేంటో ఈసారి మూడు నెలల ముందే ఫిక్స్‌ అయిపోయింది. ఓ పక్క ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ మహేశ్‌ బాబు సిద్ధమైపోయాడు. ఇంకోపక్క మామా అల్లుళ్లు వెంకటేశ్‌ - నాగచైతన్య ‘వెంకీమామ’తో జాతరకి వచ్చేస్తున్నారు. ‘అల వైకుంఠపురము’ నుంచి అల్లు అర్జున్‌ కూడా సంక్రాంతికే బరిలోకి దిగుతున్నాడు. రజనీకాంత్‌ ‘దర్బార్‌’లో ఎంటర్‌ అవుతున్నాడు. ఇవన్నీ తెలిసిన విషయాలే అంటారా! హెడ్డింగ్‌ చూశారు కదా... ఇక్కడ  టాపిక్‌ బరిలో దిగే పందెం కోళ్లు కాదు.. ఆ కోళ్లకు కట్టే కత్తులకు ఉండే పదునులాంటి అందాల కథానాయికలు గురించి. 

సంక్రాంతికి వస్తున్న సినిమాల్లో హీరోలెవరో మనకు తెలుసు. వాళ్ల సత్తా ఏంటో కూడా తెలుసు. కాబట్టి మనం హీరోయిన్ల సంగతి చూద్దాం. ఈ ముగ్గుల పండగ నాడు తమ అందాలతో కుర్రకారుని ముచ్చెమటలు పట్టించడానికి నలుగురు ముద్దుగుమ్మలు సిద్ధమైపోయారు. మహేశ్‌ను ‘సరిలేరు నీకెవ్వరు’ అంటూ రష్మిక మందన వస్తోంది. ‘..వైకుంఠపురము’లో అల్లు అర్జున్‌తో అలకనంద అలియాస్‌ పూజా హెగ్డే ఆడిపాడబోతోంది. ఇక మామ వెంకీతో పాయల్‌ రాజ్‌పుత్‌... అల్లుడు చైతుతో రాశీ ఖన్నా రాబోతున్నారు. ఇక ‘దర్బార్‌’లో రజనీకాంత్‌ సరసన నయనతార, శ్రియ నటిస్తున్నారు. 

‘సరిలేరు’ వీరికెవ్వరు

‘గీత గోవిందం’తో టాలీవుడ్‌లో ‘గీత’గా స్థిరపడిపోయింది రష్మిక మందన. ఆ తర్వాత చేసిన ‘దేవదాస్‌’, ‘డియర్‌ కామ్రేడ్‌’ పెద్దగా ఆడకపోయినా ఆమె క్రేజ్‌ మాత్రం తగ్గలేదు. వరుస సినిమాలతో బిజీగా ఉంది. మహేశ్‌బాబుతో కలసి ఆమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి బరిలో ఉంది. టాలీవుడ్‌లో ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేసిన రష్మికకు టాలీవుడ్‌లో ఇదే తొలి సంక్రాంతి. జనవరి 12న ‘గీత’ తలరాత మారి హిట్‌ వస్తుందేమో చూడాలి. అన్నట్లుగా నితిన్‌తో ఆమె కలసి నటిస్తున్న ‘భీష్మ’ డిసెంబరులో రావాల్సి ఉంది. ఇది కాకుండా అల్లు అర్జున్‌, సుకుమార్‌ సినిమాలోనూ రష్మిక నాయికగా చేస్తోంది.

 

మామా అల్లుళ్లతో కలసి...

ఒకే టికెట్‌ రెండు సినిమాలు.. ఎవరికి వద్దు చెప్పండి ఈ ఆఫర్‌. అలాగే ఒకే సినిమా ఇద్దరు హీరోయిన్లు ఈ ఆఫర్‌ కూడా ఎవరూ వదులుకోరు.  రియల్‌ మామా అల్లుళ్లు వెంకటేశ్‌- నాగచైత్య కలయికలో వస్తున్న ‘వెంకీమామ’లో ఈ డబుల్ బొనాంజా దొరుకుతుంది. వెంకటేశ్‌ సరసన అందాల ఆర్డీఎక్స్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ హోమ్లీగా కనువిందు చేయనుంది. ఇక అల్లుడు నాగచైతన్య సరసన రాశీ ఖన్నా కనిపించబోతోంది. వీరి జంట లుక్‌ ఎలా ఉంటుందో ఇటీవల దసరా పోస్టర్‌లో చూపించేశారు. సినిమా విడుదల తేదీ విషయంలో స్పష్టత లేదు. అయితే వచ్చే సినిమా సంవత్సరం ఈ చిత్రంతోనే మొదలవ్వొచ్చని తెలుస్తోంది. 

‘ఆర్‌ ఎక్స్‌ 100’తో టాలీవుడ్‌లోకి దూసుకొచ్చిన పాయల్‌ ‘ఆర్డీఎక్స్ లవ్‌’తో హీట్‌ పెంచేసింది. ఇప్పుడు వెంకీతో కలసి ఇంకెంత సందడి చేస్తుందో చూడాలి. ఈ సంక్రాంతి మెరుపు తీగల్లో సీనియర్‌ అంటే రాశీ ఖన్నా అనే చెప్పాలి. అందరిలో ఎక్కువ సినిమాలు చేసింది ఆమెనే. గ్లామర్‌ డాల్‌ ఇమేజ్‌ నుంచి పర్‌ఫార్మెన్స్‌ ఇటీవల ఓరియెంటెడ్‌ సినిమాల్లోకి వచ్చిన రాశీకి ‘వెంకీమామ’ మరోసారి అలాంటి పాత్రే దొరికిందట. అన్నట్లు నాగచైతన్య పక్కన రెండోసారి రాశీ ఖన్నా కనిపించబోతోంది. తొలి సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారా... ‘మనం’ అండి. అందులో చైతు లవర్‌గా చేసింది మరచిపోయారా? అప్పుడు బొద్దుగా ఉండేది... ఇప్పుడు సన్నగా చువ్వలా మారిందనుకోండి. 

 

బన్నీతో రెండోసారి...

రెండేళ్ల కిందట ‘దువ్వాడ జగన్నాథం’తో కలసి సందడి చేసిన పూజా హెగ్డే ఈసారి సంక్రాంతి ‘అల వైకుంఠపురము’తో మరోసారి జట్టు కడుతోంది. అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. దీంతో పూజా హెగ్డే పరిశ్రమకు వచ్చిన సుమారు ఆరేళ్ల తర్వాత సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఇప్పటికే సూపర్‌ హిట్‌ అనిపించుకున్న బన్నీ -పూజా జోడీ పెద్ద పండగ నాడు ఇంకెంత సందడి చేస్తారో చూడాలి. ఈ సినిమా జనవరి 12న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. అంటే ఆ రోజు ముగ్గురు హీరోయిన్లు బరిలో దిగుతున్నారన్నమాట.  అంతేకాదండోయ్‌ పూజాహెగ్డే మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’లో ప్రత్యేక గీతంలో ఆడిపాడనుంది.

 

‘..అరుణాచలం’తో కలసి...

తమిళనాడు నుంచి ఈ సంక్రాంతికి మరో ఇద్దరు హీరోయిన్లు వస్తున్నారు. రజనీకాంత్‌ - మురుగదాస్‌ కాంబోలో వస్తున్న ‘దర్బార్‌’లో ఇద్దరు నాయికలు ఉన్నారు. నయనతార మెయిన్‌ లీడ్‌ చేస్తుండగా, శ్రియ కీలక పాత్రలో కనిపించబోతోందని తెలుస్తోంది. రజనీకాంత్‌  ఈ సినిమాలో ఆదిత్య అరుణాచలం అనే పాత్రలో కనిపించబోతున్నాడు. రజనీకాంత్‌తో నయనతారకు ఇది మూడో సినిమా కాగా, శ్రియకు రెండో సినిమా. మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతికి వస్తోన్న ముద్దుగుమ్మల్లో సూపర్‌ సీనియర్లు వీరిద్దరే. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది. అయితే కొత్త నాయికల జోరులో సంక్రాంతి పోరులో వీరెంతవరకు నిలబడతారో చూడాలి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

తాజా వార్తలు

టాలీవుడ్‌

మరిన్ని

ఫోటోలు

హీరో మరిన్ని

హీరోయిన్ మరిన్ని

సినిమా స్టిల్స్ మరిన్ని

ఈవెంట్స్ మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.