
ఇంటర్నెట్‌డెస్క్: బ్రూస్లీ. ప్రపంచవ్యాప్తంగా ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరు. మార్షల్ ఆర్ట్స్‌లో అందరికీ ఆదర్శం ఆయనే. బ్రూస్లీ చివరిగా పూర్తి చేసిన చిత్రం ‘ఎంటర్ ది డ్రాగన్’. ఈ సినిమా కోసం చైనీస్ యాక్షన్ హీరో జాకీచాన్ స్టంట్‌మెన్‌గా పనిచేశారు. ఆ సినిమా సెట్లో జరిగిన ఓ సందర్భాన్ని జాకీచాన్ తాజాగా గుర్తు చేసుకున్నారు. అదే ఆయనను బ్రూస్లీకి దగ్గర చేసిందని అన్నారు.
‘‘అప్పుడు నేను ‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రానికి స్టంట్‌మెన్‌గా పనిచేస్తున్నా. నేను కెమెరా వెనుక ఉన్నా. హఠాత్తుగా పరిగెత్తుకుంటూ వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో బ్రూస్లీ చేతితో తిప్పుతున్న కర్ర నా తలపై కుడివైపు బలంగా తగిలింది. అంతే, ఒక్కసారిగా నా కళ్లు బైర్లుకమ్మాయి. ఏం జరిగిందో అర్థం కాలేదు. ఎదుట అంతా అస్పష్టంగా కనిపించడం ప్రారంభించింది. నేను బ్రూస్లీను చూస్తూ కింద పడిపోయాను. దర్శకుడు కట్ చెప్పగానే బ్రూస్లీ వచ్చి నన్ను పట్టుకున్నారు. నన్ను పైకి ఎత్తి క్షమించమని అడిగారు. ఆ తర్వాత నాకు పెద్దగా నొప్పి అనిపించలేదు. అయితే, నాకు నొప్పి ఉన్నట్లు బ్రూస్లీ ఎదుట నటించడం మొదలు పెట్టా. దాంతో ఆయన నాపై జాలి చూపించేవారు. ఇలా కొన్నిరోజులు సాగింది. ఈ సంఘటతోనే నేను బ్రూస్లీకి దగ్గరయ్యా’’ అని ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
‘ఎంటర్ ది డ్రాగన్’ చిత్రం 1973 ఆగస్టు 19, విడుదలైంది. అంతకుముందే జులై 20న బ్రూస్లీ కన్నుమూశారు.
తాజా వార్తలు
టాలీవుడ్
ఫోటోలు
హీరో మరిన్ని
హీరోయిన్ మరిన్ని
సినిమా స్టిల్స్ మరిన్ని
ఈవెంట్స్ మరిన్ని

దేవతార్చన
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు