నువ్వూ నేనూ సేమ్ సేమ్
‘అరె... ఇంట్లో అందరూ మ్యాచింగ్ డ్రస్సులేసుకున్నట్టూ... ఇక్కడున్న కుక్కా, పిల్లీ, కుందేలూ... నలుపూతెలుపూ రంగుల్లో సేమ్ టూ సేమ్ ఉన్నాయ్. ఒళ్లంతా బొట్లతో గుర్రమూ కుక్కా అచ్చుగుద్దినట్టు దిగిపోయాయి. గోధుమ రంగులో జింకపిల్లా, కుందేలూ మెరిసిపోతున్నాయి. కచ్చితంగా ఇదేదో ఫొటోగ్రఫిక్ జిమ్మిక్కై ఉంటుంది. లేకపోతే ఇలా ఎలా ఉంటాయబ్బా’ అని అంటారేమో కానీ ఇందులో ఏ మాయాలేదు. మార్క్ టేలర్ అనే పెట్ ఫొటోగ్రాఫర్ నైపుణ్యం తప్ప. ఓసారి చిన్న పిల్లి పిల్లా, పొట్టి కుందేలూ ఒకే రంగులో ఉండటం గమనించిన మార్క్‌కి ‘మ్యాచింగ్ యానిమల్స్’ మీద ఆసక్తి వచ్చింది. దీంతో పెంపుడు జంతువుల్లో ఒకేరకమైన బొచ్చూ, రంగూ ఉన్న వాటిని ఒక దగ్గరకు చేర్చుతూ ఫొటోలు తీయడం మొదలు పెట్టాడు. మనలా అవి స్టిల్సు ఇవ్వలేవు కదా అందుకే మంచి పోజు వచ్చే వరకు గంటల తరబడి ఓపికగా ప్రయత్నిస్తూ ఒకే పోలికలతో ఉన్న జీవుల ఫొటోలు తీస్తున్నాడు. చూసినవారి నోట ‘జంతువుల్లో తోబుట్టువులా’ అనిపిస్తున్నాడు.
Advertisement
-
-
సినిమా
-
ప్రముఖులు
-
సెంటర్ స్ప్రెడ్
-
ఆధ్యాత్మికం
-
స్ఫూర్తి
-
కథ
-
జనరల్
-
సేవ
-
కొత్తగా
-
పరిశోధన
-
కదంబం
-
ఫ్యాషన్
-
రుచి
-
వెరైటీ
-
అవీ.. ఇవీ
-
టిట్ బిట్స్