ఆలియా ‘వెల్వెట్‌’ సొగసులు చూశారా..!

సందర్భానికి తగినట్లుగా దుస్తుల్ని ఎంచుకోవడంలో బాలీవుడ్‌ తార ఆలియా భట్‌ది అందెవేసిన చేయి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌కి మోడ్రన్‌ హంగులద్దుతూ మెరిసిపోతుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా ఓ అకేషన్‌లో ఇదే సీన్‌ రిపీట్‌ చేసింది ఆలియా. వెల్వెట్‌ చీరకట్టులో ముస్తాబై అందరితో ‘వెల్‌డన్‌’ అనిపించుకుంది.

Published : 13 Mar 2024 12:48 IST

(Photos: Instagram)

సందర్భానికి తగినట్లుగా దుస్తుల్ని ఎంచుకోవడంలో బాలీవుడ్‌ తార ఆలియా భట్‌ది అందెవేసిన చేయి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడూ ట్రెడిషనల్‌కి మోడ్రన్‌ హంగులద్దుతూ మెరిసిపోతుంటుందీ ముద్దుగుమ్మ. తాజాగా ఓ అకేషన్‌లో ఇదే సీన్‌ రిపీట్‌ చేసింది ఆలియా. వెల్వెట్‌ చీరకట్టులో ముస్తాబై అందరితో ‘వెల్‌డన్‌’ అనిపించుకుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న ఈ చక్కనమ్మ శారీ లుక్స్‌ గురించి మనమూ తెలుసుకుందాం రండి..

‘బంగారం’తో హంగులు!

అది అవార్డుల ఫంక్షన్ అయినా, చిత్రోత్సవమైనా, పెళ్లైనా, పార్టీ అయినా.. తనదైన రీతిలో మెరిసిపోతుంటుంది ఆలియా. భారతీయత ఉట్టిపడేలా ఎక్కువగా చీరకట్టుకే ప్రాధాన్యమిచ్చే ఈ బ్యూటీ.. తాజాగా ఓ అవార్డుల వేడుకలోనూ అందమైన శారీలో మెరిసిపోయింది. ఆలివ్‌ గ్రీన్‌ కలర్‌ వెల్వెట్‌ చీరను ఎంచుకున్న ఆమె చీర బోర్డర్‌కు గోల్డెన్‌ జరీతో ఎంబ్రాయిడరీ చేశారు. దీనికి మ్యాచింగ్‌గా ఎంబ్రాయిడర్డ్‌ గోల్డ్‌ బ్లౌజ్‌ను జత చేసిందీ బాలీవుడ్‌ అందం. తార్‌ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్.. మొదలైన వాటితో హంగులద్దిన ఈ రవికె.. చీరకు అదనపు అందాన్ని జోడించిందని చెప్పచ్చు. ఇక బ్లౌజ్‌ ముందు, వెనక డీప్‌ నెక్‌ ఉండడంతో మోడ్రన్‌గా దర్శనమిచ్చిందీ బ్యూటీ.

స్టన్నింగ్‌ బ్యూటీ!

ప్రముఖ డిజైనర్‌ మనీష్‌ మల్హోత్రా లేబుల్‌ నుంచి ఎంచుకున్న తన శారీ లుక్‌కి రష్యన్‌ ఎమరాల్డ్‌ ఇయర్‌ రింగ్స్‌ని మ్యాచ్‌ చేసింది ఆలియా. బన్‌ హెయిర్‌స్టైల్‌తో తన లుక్కి అదనపు హంగులద్దిన ఈ ముద్దుగుమ్మ.. స్మోకీ ఐషాడో, తక్కువ మేకప్‌తో సింప్లీ సూపర్బ్‌ అనిపించుకుంది. ఇలా తన శారీ లుక్స్‌ని ‘గ్లామా డ్రామా’ క్యాప్షన్‌తో సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆలియా.. మరోసారి ఫ్యాషన్‌ ప్రియుల మనసులు దోచుకుంది. ఈ ముద్దుగుమ్మ లుక్ని చూసిన వారంతా ‘స్టన్నింగ్‌ బ్యూటీ’, ‘గార్జియస్‌’ అంటూ పొగిడేస్తున్నారు. మరి, ఈ లవ్లీ బ్యూటీ శారీ లుక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్