బట్టతలలా కనిపిస్తోంది.. జుట్టు పెరిగేదెలా?

మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు.

Published : 27 Jan 2024 19:04 IST

మేడమ్‌.. నా వయసు 21 సంవత్సరాలు. నేను నాలుగేళ్ల క్రితం రక్తహీనతతో బాధపడ్డాను. ఆ సమయంలో జుట్టు రాలిపోయి పల్చగా మారింది. దానివల్ల మా ఇంట్లో వాళ్లు నాకు గుండు చేయించారు. అయినా నా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. డాక్టర్‌ దగ్గరికి వెళ్తే శరీరంలో రక్తం తక్కువగా ఉందని రక్తం ఎక్కించారు. ఆ తర్వాత కూడా జుట్టు ఆరోగ్యంగా పెరగలేదు. దాంతో మళ్లీ గుండు చేయించుకున్నాను. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నాను. రక్తహీనత సమస్య కూడా లేదు. జుట్టు పెరుగుదలకు కావాల్సిన ఆహారం తీసుకుంటున్నాను. కానీ నా జుట్టు చాలా పల్చగా ఉంది. చూడ్డానికి బట్టతలలా కనిపిస్తోంది. నేను తిరిగి నా జుట్టుని పొందగలనా? - ఓ సోదరి

జ. మీ జుట్టు ఒత్తుగా పెరగడానికి, కుదుళ్లను దృఢంగా మార్చుకోవడానికి ఈ ప్రొటీన్‌ మాస్క్‌ని ప్రయత్నించండి. ఒక బాటిల్‌లో కప్పు పెరుగు తీసుకొని అందులో రెండు టేబుల్‌ స్పూన్ల ఆముదం నూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ నూనెని వేయండి. అలాగే ఒక గుడ్డులోంచి తీసిన తెల్లసొనని కూడా జత చేయండి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్‌ చేస్తే నురగ లాంటి పదార్థం వస్తుంది. దానిలో అర చెక్క నిమ్మరసాన్ని కలపండి. ఈ ప్యాక్‌ని మొదట జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఆపై మిగిలిన మిశ్రమాన్ని జుట్టంతా అప్లై చేసుకోవాలి. ఇలా ప్యాక్‌ వేసుకున్న తర్వాత జుట్టుని ముడి వేసుకుంటే మిశ్రమం కిందికి జారిపోకుండా ఉంటుంది. కనీసం 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆపై మొదట సాధారణ నీటితో శుభ్రం చేసుకొని.. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా కనీసం వారానికి రెండు సార్లు చేస్తే కొన్ని రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్