తరచూ మేకప్‌ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా?

నా వయసు 28 సంవత్సరాలు. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. డ్యాన్స్‌లో భాగంగా తరచూ మేకప్‌ వేసుకుంటాను. అయితే మేకప్‌ వేసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ వస్తుందని చాలామంది అంటే విన్నాను.

Published : 22 Jan 2024 12:16 IST

నా వయసు 28 సంవత్సరాలు. నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. డ్యాన్స్‌లో భాగంగా తరచూ మేకప్‌ వేసుకుంటాను. అయితే మేకప్‌ వేసుకోవడం వల్ల చర్మ క్యాన్సర్‌ వస్తుందని చాలామంది అంటే విన్నాను. ఇది నిజమేనా? మేకప్‌ వేసుకునే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? దయచేసి సలహా ఇవ్వగలరు. - ఓ సోదరి

జ. మేకప్ ఉత్పత్తులు, జుట్టుకు వేసుకునే రంగులు మొదలైన వాటిలో అమ్మోనియా వాడకాన్ని ప్రపంచవ్యాప్తంగా నిషేధించారు. ఈ క్రమంలో మేకప్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందేమోనని భయపడాల్సిన పని లేదు. అయితే మేకప్‌కు ఉపయోగించే ఉత్పత్తుల ఎంపికలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత తక్కువగా ఉండే ఉత్పత్తులలో శరీరానికి హాని కలిగించే రసాయనాలు ఉపయోగించే అవకాశం ఉంటుంది. వాటి ఫలితంగా స్కిన్ ఇరిటేషన్‌, స్కిన్‌ అలర్జీ, స్కిన్‌ డ్యామేజ్‌, మచ్చలు రావడం.. వంటి సమస్యలు వస్తుంటాయి. కాబట్టి, మేకప్ ఉత్పత్తుల ఎంపికలో వీటిని దృష్టిలో ఉంచుకోవడం మంచిది. ఒక్కొక్కరి చర్మతత్వం ఒక్కోలా ఉంటుంది. నాణ్యమైన మేకప్ ఉత్పత్తులు ఎంపిక చేసుకొన్నా కొంతమందికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వాటిని ఎంపిక చేసుకునే ముందు ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మంచిది.

ఇక జాగ్రత్తల విషయానికి వస్తే.. మేకప్‌ అవసరం తీరిన తర్వాత వెంటనే శుభ్రం చేసుకోవడం, ఎంత అవసరమో అంతవరకు మాత్రమే మేకప్‌ వేసుకోవడం చేస్తుండాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్