ప్యాక్ వేసుకోవడం, తొలగించుకోవడం.. తేలికిక!
అందానికి వివిధ రకాల ఫేస్‌ప్యాక్స్ వేసుకోవడం మనకు అలవాటే! నిజానికి ఇదో పెద్ద పని. పదార్థాలన్నీ కలుపుకోవడం ఒకెత్తయితే.. అప్లై చేసుకోవడం, తొలగించుకోవడం మరో ఎత్తు. ఈ క్రమంలో చేతులకు అంటుకోవడం, ముఖమంతా ప్యాక్ సరిగ్గా....
అందానికి వివిధ రకాల ఫేస్‌ప్యాక్స్ వేసుకోవడం మనకు అలవాటే! నిజానికి ఇదో పెద్ద పని. పదార్థాలన్నీ కలుపుకోవడం ఒకెత్తయితే.. అప్లై చేసుకోవడం, తొలగించుకోవడం మరో ఎత్తు. ఈ క్రమంలో చేతులకు అంటుకోవడం, ముఖమంతా ప్యాక్ సరిగ్గా పరచుకోకపోవడం.. వంటి అనుభవాలు చాలామందికి కామనే! ఈ సమస్యల్ని దూరం చేసి.. సులభంగా ఫేస్‌ప్యాక్ వేసుకోవడానికి ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి ‘ఫేస్‌ప్యాక్ అప్లికేటర్స్’.
పొడవాటి స్టిక్‌లా ఉండే దీనికి ఓవైపు ప్యాక్ అప్లై చేసుకోవడానికి వీలుగా వెడల్పాటి పలక ఉంటుంది. మరోవైపు మృదువైన బ్రిజిల్స్‌తో కూడిన బ్రష్ అమరి ఉంటుంది. దీనికి వెనుక భాగంలో స్పాంజి అమరిక కూడా కొన్నింటికి ఉంటుంది. ముందుగా పలక లాంటి భాగంతో ప్యాక్‌ను ముఖంపై సమానంగా పరచుకునేలా అప్లై చేసుకోవాలి. చాలావరకు ప్యాక్స్‌ని తొలగించుకునే ముందు మృదువుగా మర్దన చేస్తూ తొలగించుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం బ్రష్, స్పాంజిలను ఉపయోగించుకోవచ్చు. మేకప్ బ్రష్ మాదిరిగా, టెడ్డీ బేర్ ముఖాన్ని పోలినట్లుగా.. ఇలా వివిధ ఆకృతుల్లో లభ్యమవుతోన్న ఈ ఫేస్‌ప్యాక్ అప్లికేటర్స్‌లో కొన్నింటికి.. పక్కభాగాన చిన్న బ్రష్ ఒకటి అమరి ఉంటుంది. దాంతో కంటి కింద, ముక్కు చివర్లలో, గడ్డం దగ్గర.. ఇలా పెద్ద బ్రష్‌తో రుద్దుకోవడానికి వీల్లేని భాగాల్లో దీంతో మర్దన చేసుకోవచ్చు. పైగా ఇవన్నీ సిలికాన్‌తో రూపొందించినవి కాబట్టి.. ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. చర్మానికి ఎలాంటి హానీ కలిగించవు. అలాంటి ఫేస్‌ప్యాక్ అప్లికేటర్సే ఇవి! వీటిని ఉపయోగించిన తర్వాత జాగ్రత్తగా శుభ్రం చేయడం మాత్రం మరిచిపోకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.