వేసవికి తగ్గట్లుగా..

చల్లనివాతావరణం నుంచి వేసవిలోకి అడుగుపెడుతున్న సమయమిది. చర్మాన్ని తాజాదనంతో మెరిసేలా చేయడానికి ఎన్నెన్నో క్రీములు రాస్తుంటాం. అయితే ఇటువంటి వాటిని సీజన్‌కు తగినట్లుగా ఎంచుకోవాలి అంటున్నారు సౌందర్య నిపుణులు. 

Published : 02 Mar 2022 00:49 IST

చల్లనివాతావరణం నుంచి వేసవిలోకి అడుగుపెడుతున్న సమయమిది. చర్మాన్ని తాజాదనంతో మెరిసేలా చేయడానికి ఎన్నెన్నో క్రీములు రాస్తుంటాం. అయితే ఇటువంటి వాటిని సీజన్‌కు తగినట్లుగా ఎంచుకోవాలి అంటున్నారు సౌందర్య నిపుణులు.  

క్లెన్సర్‌.. వేసవిలో జెల్‌ తరహావి ఎంచుకోవాలి. ఆపై కీరదోస ముక్కలను నానబెట్టిన నీరు లేదా గులాబీనీటిని టోనర్‌గా వాడాలి. చర్మరంధ్రాల్లోని మురికిని పోగొట్టడంలో ఇవి తోడ్పడి, మొటిమల సమస్యను దరిచేరనివ్వకుండా చేయడంతోపాటు చర్మాన్నీ ఆరోగ్యంగా ఉంచుతాయి.  
మాయిశ్చరైజర్‌.. జెల్‌ రకానికి మారడం మంచిది. సెరామైడ్స్‌, నియాసినమైడ్‌ ఉండే మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి.
సీరం.. నీటి రూపంలో ఉండే సీరాన్ని చర్మం తేలికగా పీల్చుకోవడంతో జిడ్డుగా కనిపించదు. దాంతో చర్మం తేమతో నిగారింపుని సంతరించుకుంటుంది. సి విటమిన్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉండే వాటిని ఎంచుకుంటే సూర్యకిరణాల ప్రభావం ఎక్కువగా పడకుండా చర్మాన్ని కాపాడుకోవచ్చు. వృద్ధాప్యఛాయలకు దూరంగా ఉండొచ్చు.  
సన్‌స్క్రీన్‌.. వయసు, చర్మానికి తగిన ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌స్క్రీన్‌ వినియోగం వేసవిలో ముఖానికి మంచిది.  మాయిశ్చరైజర్లలో భాగంగా తక్కువ మోతాదులో ఉండే ఎస్‌పీఎఫ్‌లు ఈ కాలంలో అంతగా చర్మపరిరక్షణను చేయలేవు. కొన్నిరకాలు చెమటతో కలిసి కరిగిపోతాయి. బదులుగా వాటర్‌ ప్రూఫ్‌రకాలు ఎంచుకుంటే మంచిది. లేదంటే సూర్యకిరణాలకు నేరుగా చర్మం ప్రభావితమవుతుంది. బయటికెళ్లేటప్పుడు ఎండ ప్రభావం పడకుండా టోపీలాంటివి వాడటం మంచిది. వీటన్నింటితోపాటు శరీరానికి తగినంత నీరు, నీటిశాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలకు ప్రాముఖ్యతనిస్తే నిత్యం చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్