అందానికే కాదు.. రక్షణకీ!

చూడటానికి బ్రేస్‌లెట్‌లా బాగుంది కదూ! ఇది రక్షణనీ ఇస్తుంది. ఒక్కోసారి ఆపద ముంచుకొస్తున్నా సమయానికి ఫోన్‌ తీసి సాయం కోరే అవకాశముండదు. అలాంటప్పుడు సాయపడే వీలుగా దీన్ని తయారు

Published : 14 Sep 2022 00:40 IST

చూడటానికి బ్రేస్‌లెట్‌లా బాగుంది కదూ! ఇది రక్షణనీ ఇస్తుంది. ఒక్కోసారి ఆపద ముంచుకొస్తున్నా సమయానికి ఫోన్‌ తీసి సాయం కోరే అవకాశముండదు. అలాంటప్పుడు సాయపడే వీలుగా దీన్ని తయారు చేశారు. సేఫ్‌లెట్‌గా పిలిచే ఈ పరికరం ఫోన్‌తో అనుసంధానమై ఉంటుంది. దీనికి ఇరువైపులా రెండు బటన్లు ఉంటాయి. ఆపద సమయంలో వాటిని నొక్కితే చాలు.. మీ ఆప్తులకు ఆ విషయం తెలుపుతూ మెసేజ్‌ వెళుతుంది. ఈ స్మార్ట్‌ బ్రేస్‌లెట్‌.. ఫోన్‌తో అనుసంధానమై సంభాషణనీ రికార్డ్‌ చేయగలదు. కావాలనుకుంటే ఈకామర్స్‌ వేదికల్లో ప్రయత్నించవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్