పూల సోకు!
సంప్రదాయంగా ముస్తాబై తల్లో పూలు పెట్టుకోవడం మర్చిపోతే ఎలా? జడ బోసిపోదూ! అందుకే, తరాలు మారినా.. వాటిపై మగువల మక్కువ తరగట్లేదు.
సంప్రదాయంగా ముస్తాబై తల్లో పూలు పెట్టుకోవడం మర్చిపోతే ఎలా? జడ బోసిపోదూ! అందుకే, తరాలు మారినా.. వాటిపై మగువల మక్కువ తరగట్లేదు. ఆధునికత ఒంట పట్టించుకున్న నేటి తరం అమ్మాయిలూ దీన్ని అనుసరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ పూలజడలను ఇష్టపడితే ఇప్పుడిక పక్క పూల వంతు. జడవేసుకున్నా, కొప్పు పెట్టుకున్నా... గులాబీలూ, మల్లెలు, బేబీబ్రెత్, చామంతి... ఏవైనా సరే! జడకు ఓ వైపున సింగారించుకోవడమే ప్రత్యేకతట. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ అందరిదీ ఇదే మాట. మీకూ నచ్చిందా!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.