సహజంగా మెరిసిపోదామా!

పండగపూట అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి....! అయితే, పని అలసటో, ఒత్తిడో... కారణం ఏదైతేనేం... ఒక్కోసారి మోము కళ తప్పుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేకప్‌ చిట్కాలు పాటించి చూడండి.. మెరిసిపోవచ్చు. మేకప్‌ వేసుకునే అలవాటు లేనివారికి మోనోక్రోమిక్‌ లుక్‌ చక్కటి ఎంపిక.

Updated : 23 Oct 2023 03:39 IST

పండగపూట అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి....! అయితే, పని అలసటో, ఒత్తిడో... కారణం ఏదైతేనేం... ఒక్కోసారి మోము కళ తప్పుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మేకప్‌ చిట్కాలు పాటించి చూడండి.. మెరిసిపోవచ్చు.

  • మేకప్‌ వేసుకునే అలవాటు లేనివారికి మోనోక్రోమిక్‌ లుక్‌ చక్కటి ఎంపిక. అలంకరణ సహజంగా కనిపించేందుకు ముఖం, కళ్లు, పెదాలకు ఒకే ఛాయలో ఉండే లేత రంగుల్ని వినియోగిస్తారు.  గులాబీ, కోరల్‌తో పాటూ లేత రంగులను ఇందుకు వాడతారు. చివరగా కళ్లకు ఐలైనర్‌ గీస్తే చాలు... పండగ ప్రత్యేకతంతా మీ దగ్గరే కనిపిస్తుంది.
  • ఈ తరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడే గ్లాసీ లుక్‌ కోసం ద్రవరూప ఉత్పత్తుల్ని ఎంచుకోవాలి. ముందుగా మాయిశ్చరైజర్‌ తర్వాత ప్రైమర్‌, ఆపై ఎస్‌పీఎఫ్‌30 ఆయిల్‌ఫ్రీ సన్‌స్క్రీన్‌లోషన్‌ రాసుకోవాలి. కాసేపటికి చర్మ ఛాయలో ఉన్న తేడాలు అర్థమవుతాయి. వాటిని కన్సీలర్‌తో సరిదిద్దాలి. ఇప్పుడు లిప్‌స్టిక్‌తో చెంపలను హైలైట్‌ చేయాలి. పెదాలకు లిప్‌గ్లాస్‌ వాడాలి. చివరగా పౌడర్‌తో సెట్‌ చేస్తే పట్టుదుస్తుల్లో ధగధగలాడిపోతారు.
  • సంప్రదాయ దుస్తులు ధరించినప్పుడు మేకప్‌ అతిగా ఉంటే బాగోదు. అలాగని మరీ డల్‌గా ఉన్నా నప్పదు. అలాంటప్పుడు గ్లిట్టర్‌ మేకప్‌ని ఎంచుకోండి. మాయిశ్చరైజర్‌, ప్రైమర్‌ రాశాక... పౌడర్‌ రాస్తే చాలు. కంటి మేకప్‌పై కాస్త ఎక్కువ దృష్టిపెట్టండి. కళ్లకు ఐలైనర్‌ గీసుకుని ఆపై బంగారు రంగు గ్లిట్టర్‌ ఐషాడోను కనురెప్పలకు వేస్తే సరి. పండగ శోభంతా మీతోనే ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్