ఎండల్లో అందాన్ని కాపాడుకుందామిలా!

ఎండాకాలం వచ్చేసింది. కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ చేస్తేనే అందంగా, ఆరోగ్యంగా కనిపించొచ్చు. ఇందుకోసం బ్యూటీ రొటీన్‌లో ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.

Published : 14 Mar 2024 01:15 IST

ఎండాకాలం వచ్చేసింది. కాలాన్ని బట్టి చర్మ సంరక్షణ చేస్తేనే అందంగా, ఆరోగ్యంగా కనిపించొచ్చు. ఇందుకోసం బ్యూటీ రొటీన్‌లో ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి.

  •  వేసవిలో దుమ్మూధూళీ, చెమట వంటి వాటివల్ల చర్మంపై మురికి పేరుకుపోతుంది. వీటితో చర్మగ్రంథులు మూసుకుపోయి.. మొటిమలకు దారితీస్తాయి. వాటిని పోగొట్టేందుకు చెంచా కీరదోస రసంలో కాస్త నిమ్మరసం, తేనె కలిపి ముఖాన్ని రోజూ క్లెన్స్‌ చేయడం తప్పనిసరి. ఆపై కప్పు సెనగపిండిలో కాస్త పంచదార, పావుకప్పు నువ్వుల నూనె కలిపి ఒంటికి స్క్రబ్‌ చేయండి. అరగంటయ్యాక కడిగేస్తే మోము కళగా మెరిసిపోతుంది.
  • మారిన కాలానికి తగ్గట్లు చర్మ సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోవాలి. ముఖ్యంగా వాటిల్లో సెరమైడ్‌, ఆక్వా, గ్లిజరిన్‌ వంటివి ఉండేలా చూసుకుంటే సరి.
  • ఇప్పటివరకూ సన్‌స్క్రీన్‌ని రోజూ రెండు సార్లు రాసుకుంటుంటే... వేసవిలో మూడు నుంచి నాలుగుసార్లు రాయాలి. లేదంటే ట్యాన్‌, పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు తప్పకపోవచ్చు. ఇందుకోసం ఎస్‌పీఎఫ్‌ 30కిపైన ఉన్న రకాల్ని ఎంచుకోవాలి.
  • ఎండాకాలంలో జుట్టు పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. దుమ్మూధూళీ చేరి చుండ్రుకీ కారణం అవుతుంది. ఇలాకాకుండా ఉండాలంటే... రోజు విడిచి రోజు తలస్నానం తప్పక చేయాలి. జుట్టుని పూర్తిగా ఆరనివ్వాలి. ఇందుకోసం డ్రైయ్యర్లు, కర్లర్లు, స్ట్రెయిటనర్లు వినియోగించడం వంటివి మాత్రం చేయొద్దు. వారానికి రెండు సార్లైనా మృదుత్వాన్ని, పోషణనూ అందించే మందారం-మెంతి-పెరుగు కలిపిన ప్యాక్‌ను వేస్తే సరి. జుట్టు ఆరోగ్యంగా, అందంగా కనిపిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్