మెరిసే చర్మం మీ సొంతం

అందంగా కనిపించడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాం.. కానీ పైపూతలే సరిపోవు. తినే ఆహారంపైనా శ్రద్ధపెట్టాలి. మన ఆహారమే మన అందాన్ని నిర్ణయిస్తుంది.

Published : 15 Mar 2024 01:39 IST

అందంగా కనిపించడానికి అనేక రకాల సౌందర్య ఉత్పత్తులు వాడుతుంటాం.. కానీ పైపూతలే సరిపోవు. తినే ఆహారంపైనా శ్రద్ధపెట్టాలి. మన ఆహారమే మన అందాన్ని నిర్ణయిస్తుంది...

క్యారెట్‌.. రోజుకో క్యారెట్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని పోషకాలు మృతకణాలనూ, టాక్సిన్లనూ బయటకు పంపి తాజాగా ఉండేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా విటమిన్‌- ఎ అదనపు సెబమ్‌ ఉత్పత్తిని తగ్గించి రంధ్రాలు మూసుకుని పోకుండా కాపాడుతుంది. నేరుగా తిన్నా, జ్యూస్‌ రూపంలో తీసుకున్నా ఫలితం ఉంటుంది.

టొమాటో.. యవ్వనంగా కాంతిమంతంగా కనిపించే చర్మం కావాలి అంటే... ఇది చాలా బాగా పని చేస్తుంది. అందుకే చర్మ సంరక్షణలో దీన్ని విరివిగా ఉపయోగిస్తుంటారు. దీనిలో ఉండే లైకోపీన్‌ ముడతలు, గీతలను రాకుండా కాపాడుతుంది. దీన్ని పచ్చిగా తినే కంటే ఉడికించి తీసుకుంటేనే మంచిది.

బొప్పాయి.. ఇందులో విటమిన్‌-ఎ తో పాటు పపైన్‌ అనే ఎంజైమ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి చర్మాన్ని హైడ్రేట్‌ చేయడానికి, పునరుజ్జీవింప చేయడానికి బాగా పని చేస్తాయి. రోజూ తినడం వల్ల డార్క్‌స్పాట్స్‌, చర్మం పొడిబారడం తగ్గుతాయి. చర్మంతో పాటు కళ్లు, గోళ్ల్లు, జుట్టుకి కూడా ప్రయోజనం చేకూరుతుంది.

అవకాడో.. ఇందులో విటమిన్‌- సి, ఇ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే యూవీ కిరణాలు, ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడతాయి. అలాగే యాంటీ మెక్రోబియల్‌ గుణాలు పుష్కలంగా ఉండి చర్మాన్ని పెళుసుగా మారకుండానూ, మంటను తగ్గించడంలోనూ సాయపడతాయి. దీన్ని తీసుకోవడంవల్ల సెరటోనిన్‌ స్థాయులు పెరిగి, మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

బ్లూబెర్రీస్‌.. రుచికే కాదు చర్మానికి మేలు చేయడంలోనూ ముందే ఉంటాయి. ఇవి మొటిమలు, ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. వీటిలో ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ట్యాన్‌ నుంచి రక్షణ కల్పిస్తాయి. అంతేకాదు, రక్త ప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్