అడ్డిగ... అందాల నగ!

తరాలు మారుతున్నా... బంగారు నగలపై అమ్మాయిలకు మోజు మాత్రం ఎన్నటికీ తరగదు. అందుకే, అప్పుడెప్పుడో అమ్మమ్మ, నానమ్మలు మెచ్చిన నగలు మళ్లీ మనల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాయి. వాటిల్లో అడ్డిగ ఒకటి.

Published : 19 Mar 2024 01:07 IST

తరాలు మారుతున్నా... బంగారు నగలపై అమ్మాయిలకు మోజు మాత్రం ఎన్నటికీ తరగదు. అందుకే, అప్పుడెప్పుడో అమ్మమ్మ, నానమ్మలు మెచ్చిన నగలు మళ్లీ మనల్ని మెప్పించేందుకు వచ్చేస్తున్నాయి. వాటిల్లో అడ్డిగ ఒకటి.

మెడకి నెక్లెస్‌లా చుట్టుకునే ఈ టెంపుల్‌ స్టైల్‌ నగకు దక్షిణ భారతీయ సంప్రదాయ ఆభరణాల డిజైన్లలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రాచీన భారతీయ చరిత్రకూ ప్రతిబింబంగానూ నిలుస్తోంది. అడ్డిగ, అద్దిగై, అద్దిగే... వంటి పేర్లతో ప్రాంతాన్ని బట్టి ఒక్కో పేరుతో పాపులర్‌ అయ్యింది. 9నుంచి16 వ శతాబ్దం వరకూ అంటే... చోళ, పాండ్య, రాయల సామ్రాజ్యాలు వెలుగొందిన సమయంలో ఈ నగ రాజ కుటుంబ స్త్రీలను ఎంతగానో ఆకట్టుకుంది.. తామెంతో ఇష్టంగా ధరించిన ఆ చోకర్‌ని... తరవాతి కాలంలో ఆయా రాజకుటుంబాలు... ఆలయాలకు విరాళాలుగా ఇచ్చే నగల్లో స్థానం కల్పించారట. కాలక్రమంలో దీన్ని ఆలయ నర్తకీమణులు నృత్యం చేసే సమయంలో ధరించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనల్లో తప్పనిసరిగా ధరించే నగ అయ్యింది. దక్షిణ భారత వధువుల అలంకరణలో అందంగా అమరిపోయింది. ఇలా 70లవరకూ వెలిగిపోయిన ఈ డిజైన్‌, ఆపై కొంతకాలానికి కనుమరుగైంది. ఇప్పుడు మళ్లీ కెంపులు, పచ్చలు, తెల్ల రాళ్లతో చేసిన రకాలతో పాటు సాదా బంగారు గొలుసుకు వజ్రాలూ, రత్నాలూ, రాళ్లను పొదిగిన హెవీ పెండెంట్లను జత చేసిన అడ్డిగలూ వస్తున్నాయి. నేటితరం అమ్మాయిల మనసుని దోచుకుంటున్నాయి. లంగాఓణీ కట్టినా, పట్టు చీరే ఎంచుకున్నా...మెడలో ఒక్క అడ్డిగ పెట్టుకుంటే చాలు మెరిసిపోవచ్చని చెబుతూ మురిసిపోతున్నారు. వాటిల్లో కొన్ని ఇవి... మీరూ ఓ లుక్కేయండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్