మొటిమలు మాయం...

టీట్రీ నూనె మొటిమలకు మంచి మందు. ఇది చర్మంలో త్వరగా ఇంకిపోతుంది. దీంతో ముఖాన్ని రాత్రి సమయాల్లో మృదువుగా మర్దనా చేసుకుంటే మొటిమలు రాకుండా పరిరక్షిస్తుంది.

Updated : 08 Sep 2022 15:59 IST

‌* ‌టీట్రీ నూనె మొటిమలకు మంచి మందు. ఇది చర్మంలో త్వరగా ఇంకిపోతుంది. దీంతో ముఖాన్ని రాత్రి సమయాల్లో మృదువుగా మర్దనా చేసుకుంటే మొటిమలు రాకుండా పరిరక్షిస్తుంది.

‌*  తలలో చుండ్రు కూడా మొటిమలకు కారణమవుతుంది. కొన్ని హెయిర్‌ప్యాక్‌లు ముఖచర్మంపై ప్రభావాన్ని చూపుతాయి. మరికొందరికి సబ్బు, షాంపూవంటివి మారినప్పుడు కూడా మొటిమలు వస్తాయి. కొందరిలో హార్మోన్ల ప్రభావమూ కారణమవుతుంది. వైద్యులను సంప్రదించి ఈ సమస్యనుంచి బయటపడాలి.

‌* మొటిమలు తగ్గుముఖం పడుతున్నప్పుడు చాలామంది గోటితో గిల్లుతుంటారు. దీనివల్ల ఆ ప్రాంతంలో మచ్చలేర్పడి శాశ్వతంగా ఉండి పోతాయి. వీటిపై రోజుకి రెండుసార్లు పుచ్చకాయ రసం లేదా తేనె రాస్తే చాలు. మటుమాయం అవుతాయి. ముఖమూ కాంతులీనుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్