వర్షాకాలంలో..

గొంతునొప్పి బాధిస్తున్నప్పుడు రెండు చెంచాల తులసిరసంలో చెంచా తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.చెంచా వాములో రెండు కప్పుల నీళ్లను వేసి మరిగించి నోరు పుక్కిలిస్తే ఈ కాలంలో వచ్చే గొంతుకు సంబంధించిన సమస్యలకు దూరంకావొచ్చు.

Published : 17 Aug 2021 01:43 IST

* గొంతునొప్పి బాధిస్తున్నప్పుడు రెండు చెంచాల తులసిరసంలో చెంచా తేనె కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

* చెంచా వాములో రెండు కప్పుల నీళ్లను వేసి మరిగించి నోరు పుక్కిలిస్తే ఈ కాలంలో వచ్చే గొంతుకు సంబంధించిన సమస్యలకు దూరంకావొచ్చు.

* ప్రతిరోజు రెండు ఉసిరికాయలను తింటే, వ్యాధినిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాలకు గురికారు.

* కప్పు నీటిలో అరచెంచా మిరియాలపొడి వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతులో కఫం తగ్గుతుంది.

* వర్షాకాలంలో బ్రెడ్‌ను వృథాకాకూడదంటే మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. దీన్లోని తేమ పోయేవరకు చిన్నమంటపై వేడి చేసి ఆరనిచ్చి గాజుసీసాలో భద్రపరుచుకుంటే వేపుళ్లలో వాడుకోవచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్