నల్ల మచ్చలు పోవాలంటే...

ఎంత అందంగా తయారైనా... ముఖం మీద నల్లని మచ్చలు కనిపిస్తే... శ్రమంతా వృథా అయినట్టే! వీటికి పరిష్కారాలు మీ వంటింట్లోనే ఉన్నాయి.

Published : 18 Aug 2021 01:16 IST

ఎంత అందంగా తయారైనా... ముఖం మీద నల్లని మచ్చలు కనిపిస్తే... శ్రమంతా వృథా అయినట్టే! వీటికి పరిష్కారాలు మీ వంటింట్లోనే ఉన్నాయి.
నిమ్మరసం-తేనె.. నల్ల మచ్చలకు ముఖ్య కారణం విటమిన్‌ సి లోపమే. రెండు చెంచాల నిమ్మరసంలో కాస్త తేనె కలిపాలి. ఈ మిశ్రమాన్ని మచ్చలున్న చోట రాయాలి. పది నిమిషాలయ్యాక చల్లని నీటితో కడగాలి.
గంధం పొడి - గులాబీ నీరు... గంధం పొడికి రోజ్‌వాటర్‌ను, రెండు చుక్కల గ్లిజరిన్‌ను కలిపి పేస్టు చేయాలి. ఉదయాన్నే లేచాక మచ్చలకు రాయలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగి... మాయిశ్చరైజర్‌ రాయాలి. ఇలా ఓ పదిహేను రోజులు క్రమం తప్పకుండా రాసుకుంటే ఫలితం ఉంటుంది.
పాలు-గులాబీ ముద్ద... పాలల్లో చెంచా గులాబీ రేకల మిశ్రమం కలపాలి. పావు గంటయ్యాక దాన్ని ముఖానికి రాయాలి. ఇలా తరచూ చేస్తుంటే... మచ్చలు తగ్గు ముఖం పడతాయి.
ఓట్‌మీల్‌- పెరుగు... చెంచా పెరుగుకు రెండు చెంచాల ఓట్‌మీల్‌ కలిపి రాసుకోవాలి. అరగంటయ్యాక కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే మచ్చలు తగ్గి నిగారింపు వస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్