వ్యర్థాలను బయటకి పంపే యాలకులు!

యాలకులు సువాసనా, రుచీ కోసం మాత్రమే కాదు... వాటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయంటున్నాయి పలు అధ్యయనాలు. క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి...

Published : 02 Sep 2021 00:59 IST

యాలకులు సువాసనా, రుచీ కోసం మాత్రమే కాదు... వాటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును అదుపు చేస్తాయంటున్నాయి పలు అధ్యయనాలు. క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండానూ అడ్డుకుంటాయట. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి.

అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు... ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. నోటి దుర్వాసన తగ్గిస్తాయి.

యాలకుల్ని ఆహారంలో భాగం చేసుకుంటే... శ్వాస కోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి.

యాలకుల్లో ఉండే కీలక విటమిన్లు,  ఫైటో న్యూట్రియంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌... జుట్టుని, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపించి... మెరిసిపోయేలా చేస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్