డబుల్‌ చిన్‌ తగ్గాలా...

సాధారణంగా డబుల్‌ చిన్‌ బరువు పెరగడం వల్లే వస్తుంది. బరువు తగ్గితే అదీ తగ్గిపోతుంది. అందుకోసం పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే సరి.రోజూ మూడునాలుగు సార్లు కాయగూరలను

Updated : 29 Feb 2024 16:52 IST

సాధారణంగా డబుల్‌ చిన్‌ బరువు పెరగడం వల్లే వస్తుంది. బరువు తగ్గితే అదీ తగ్గిపోతుంది. అందుకోసం పోషకాహారం తీసుకుంటూ క్రమం తప్పక వ్యాయామం చేస్తే సరి.

రోజూ మూడునాలుగు సార్లు కాయగూరలను ఆహారంలో చేర్చుకోండి. మూడు పూటలు పండ్లనూ తినండి.

* రిఫైండ్‌ గ్రైయిన్స్‌ స్థానంలో చిరుధాన్యాలను చేర్చుకోండి. వీటిని కొద్ది మొత్తంలో తీసుకున్నా పొట్ట నిండిన భావన కలిగి త్వరగా ఆకలేయదు.

* ప్రాసెస్డ్‌ ఫుడ్‌, వేపుళ్లకు దూరంగా ఉండాలి. లేదంటే బరువు పెరగడం ఖాయం.

* ప్రొటీన్‌ అధికంగా ఉండే చికెన్‌, ఫిష్‌లను తినండి.

* చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. కొవ్వు తక్కువగా ఉండే పాల ఉత్పత్తులను ఎంచుకోవాలి.

ఇవీ వ్యాయామాలు...

* నిటారుగా నిల్చొని.. తలను వెనక్కి వంచి పై కప్పును చూడాలి. దాన్ని ముద్దాడినట్లు పెదాలతోపాటు చుబుకాన్ని (చిన్‌) ముందుకు చాపాలి. ఇలా అయిదారు సెకన్లు ఉండాలి. తర్వాత యథాస్థితికి రావాలి. ఇలా పది, పదిహేనుసార్లు చేయాలి.

* తలను వెనక్కి వంచి సీలింగ్‌ను చూడాలి. నోరు పెద్దగా తెరిచి ఒకటి నుంచి అయిదు వరకు మనసులో లెక్కపెడుతూ నాలుకను మెల్లిగా బయటకు సీలింగ్‌ వైపునకు పెట్టాలి. ఆ తర్వాత తిరిగి అయిదు లెక్కపెడుతూ లోపలికి తీసుకోవాలి. ఇలా పది సార్లు చేయాలి.

* తలను వెనక్కి వంచి సీలింగ్‌ చూస్తూ తలను మెల్లిగా కుడివైపునకు వంచాలి. అలాగే కింది దవడను ముందుకు చాచాలి. ఇలా ఓ పదిసెకన్లు ఉండాలి. ఇలాగే ఎడమవైపు కూడా చేయాలి. ఇలా పదిసార్లు చేయాలి.

* నిటారుగా నిల్చోవాలి. ఇప్పుడు చుబుకాన్ని ఛాతీకి తగిలిలే కిందకు వచ్చి మెల్లిగా తలను కుడివైపు తిప్పాలి. ఈ స్థితిలో అయిదు సెకన్ల ఉండి తిరిగి యథాస్థానానికి రావాలి. ఇలాగే ఎడమవైపు కూడా చేయాలి. మెల్లిగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్