రోగ నిరోధకతకు..మూడు సూత్రాలు

కరోనా రోగనిరోధక శక్తి ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అసలే అది విజృంభిస్తున్న సమయమిది. దీంతో ఇల్లాళ్లందరూ కుటుంబ ఆరోగ్యంపై దృష్టిపెట్టుంటారు. జాగ్రత్తలే కాదు.. జీవనశైలిలోనూ తగిన మార్పులు చేసినప్పుడే మీరననుకున్నది సాధ్యమంటున్నారు

Updated : 03 Feb 2022 06:08 IST

కరోనా రోగనిరోధక శక్తి ప్రాముఖ్యాన్ని తెలియజేసింది. అసలే అది విజృంభిస్తున్న సమయమిది. దీంతో ఇల్లాళ్లందరూ కుటుంబ ఆరోగ్యంపై దృష్టిపెట్టుంటారు. జాగ్రత్తలే కాదు.. జీవనశైలిలోనూ తగిన మార్పులు చేసినప్పుడే మీరననుకున్నది సాధ్యమంటున్నారు నిపుణులు.

1. ఎప్పుడోసారి జిహ్వచాపల్యం కనబరిస్తే ఫర్లేదు. కానీ.. ఎక్కువగా ఆరోగ్యకరమైన వాటికే ప్రాధాన్యమివ్వాలి. పీచు, విటమిన్‌ సి సమృద్ధిగా ఉండేవాటితోపాటు రోజువారీ ఆహారంలో క్యాబేజీ, బ్రకోలీ, పాలకూర వంటివి తప్పక ఉండేలా చూసుకోవాలి.
2. శరీరానికి మనమిచ్చే పెద్ద బహుమతి నిద్రే. ఇది శరీరంలోని మలినాల్ని బయటకు పంపడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగని రాత్రి ఆలస్యంగా పడుకొని 8 గంటలు కొనసాగిద్దామనుకోకండి. ఇది శరీర పనితీరుపై ప్రభావం చూపి ఒత్తిడి, భావోద్వేగాల్లో మార్పులు, అధిక బరువులతోపాటు ఇతర అనారోగ్యాలకు దారి తీస్తుంది.
3. వ్యాయామం రోగనిరోధకతపై ప్రభావం చూపుతుందని అధ్యయనాలూ రుజువు చేస్తున్నాయి. క్రమం తప్పకుండా చేసే కసరత్తులు రక్తంలో ఇన్ఫెక్షన్లతో పోరాడే టీ కణాల వృద్ధికి తోడ్పడతాయి. రోజు ఉదయం కొద్దిసేపు ఎండలో ఉండటం, వేగవంతమైన నడక కొనసాగించినా ఆరోగ్యమే. చిన్నవే కదూ..పాటించేయండి మరి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్