నడుం నొప్పిగా ఉందా...

మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నడుం నొప్పి. జ్వరంగా లేదా దెబ్బ తగిలి శరీరానికి గాయమైతే పైకి తెలుస్తాయి. కానీ ఇదలా కాదు, కంటికి కనిపించకుండా యాతన పెడుతుంది. ఎక్కువ పని చేయలేం. ఇల్లు ఊడవటం, బట్టలు గుంజటం లాంటి నడుం వంచి చేసే పనులు అసలే చేయలేం. కనీసం కాసేపు కూర్చోలేం, నిలబడలేం. కానీ పడుకునే ఉండాలంటే కుదురుతుందా? ఎంత కష్టం?! ఇంత అవస్థ పెట్టే తుంటి, నడుం నొప్పులకు యోగాలో పరిష్కారం ఉంది. ...

Updated : 04 Jun 2022 06:27 IST

నలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్య నడుం నొప్పి. జ్వరంగా లేదా దెబ్బ తగిలి శరీరానికి గాయమైతే పైకి తెలుస్తాయి. కానీ ఇదలా కాదు, కంటికి కనిపించకుండా యాతన పెడుతుంది. ఎక్కువ పని చేయలేం. ఇల్లు ఊడవటం, బట్టలు గుంజటం లాంటి నడుం వంచి చేసే పనులు అసలే చేయలేం. కనీసం కాసేపు కూర్చోలేం, నిలబడలేం. కానీ పడుకునే ఉండాలంటే కుదురుతుందా? ఎంత కష్టం?! ఇంత అవస్థ పెట్టే తుంటి, నడుం నొప్పులకు యోగాలో పరిష్కారం ఉంది. ఈ ఆసనాన్ని ప్రయత్నించండి. ... ఎంత ఉపయుక్తమో మీకే అర్థమవుతుంది.

తుంటి, నడుం నొప్పులకు వ్యాఘ్రాసనం ఔషధంలా పనిచేస్తుంది. వయసుతో నిమిత్తం లేకుండా చిన్నా పెద్దా అందరూ చేయొచ్చు. సమస్య లేని వారు చేస్తే భవిష్యత్తులో రాకుండా ఉంటాయి.

ఎలా చేయాలంటే... మోకాళ్లు కింద ఆనించి, రెండు చేతులూ భుజాలకు సమాంతరంగా ఉండేలా నేలమీద ఆనించాలి. నెమ్మదిగా ఎడమ కాలును పైకి లేపాలి. పాదం ఎంత ఎత్తుకు లేపగలిగితే అంత పైకి లేపాలి. ముందు భాగం తల వైపు వచ్చేలా పెట్టాలి. ఈ స్థితిలో ఉండ గలిగినంతసేపు ఉండి మెల్లగా కాలు కిందికి దించాలి. తర్వాత కుడికాలితో కూడా ఇలాగే చేయాలి. ఇలా మారుస్తూ కుడికాలితో మూడుసార్లు, ఎడమకాలితో మూడుసార్లు చొప్పున రోజూ చేస్తే సయాటికా నరం బలపడుతుంది. నడుం, తుంటి నొప్పులు తగ్గుతాయి. అయితే ఈ ఆసనాన్ని వేగంగా చేయకూడదు, నెమ్మదిగా.. అలసటకు లోనవ్వకుండా చేయగలిగినంతసేపు మాత్రమే చేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్