పాదాలకీ వ్యాయామం!

ఉదయం లేచినప్పటి నుంచీ వంట, పిల్లల్ని స్కూలుకి సిద్ధం చేయడం.. ఎక్కువగా నిల్చొనే పని చేస్తుంటాం. మన బరువుని మోసే, నడిపించే పాదాల గురించీ ఆలోచించారా? శరీరానికి సంబంధించిన ఇంద్రియ గ్రాహకాలన్నీ పాదాల్లోనే ఉంటాయంటారు.

Updated : 03 Jul 2022 06:49 IST

ఉదయం లేచినప్పటి నుంచీ వంట, పిల్లల్ని స్కూలుకి సిద్ధం చేయడం.. ఎక్కువగా నిల్చొనే పని చేస్తుంటాం. మన బరువుని మోసే, నడిపించే పాదాల గురించీ ఆలోచించారా? శరీరానికి సంబంధించిన ఇంద్రియ గ్రాహకాలన్నీ పాదాల్లోనే ఉంటాయంటారు. వాటినీ పట్టించుకుంటేనే అసలైన ఆరోగ్యమంటున్నారు నిపుణులు. మరి ఈ చిన్ని చిన్ని వ్యాయామాలను చేద్దామా?


* కుర్చీలో కూర్చొని పాదాలను నేలకు ఆన్చాలి. తర్వాత పాదాల వేళ్లను ముడిచి మడమను పైకి లేపాలి. 5-10 సెకన్ల తర్వాత నెమ్మదిగా సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇలా ఓ 10సార్లు చేస్తే సరి. ఇది పాదం, కాలివేళ్లకు బలాన్ని చేకూరుస్తుంది.


* నేల మీద నిల్చొని పాదాల వేళ్ల వరకూ లేపి ఒక్కో వేలూ నేలకు ఆన్చాలి. ఇలా అయిదు సార్లు చేస్తే సరి. ఇది పాదాల్లో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.


* సుఖాసనంలో కూర్చోండి. పాదాల వేళ్లను దూరం చేసి 15 సెకన్లపాటు అలాగే ఉంచండి. తర్వాత తిరిగి మామూలు స్థితికి తీసుకురండి. ఇలా 15 సార్లు చేసి చూడండి. రక్తప్రసరణ సరిగా జరగడమే కాదు.. అక్కడి ఎముకలూ దృఢపడతాయి.


* నేలమీద కొన్ని గులకరాళ్లను వేయండి. కుర్చీలో నిటారుగా కూర్చొని వాటిని పాదాల వేళ్లతో తీసి, పక్కన గిన్నె లేదా పళ్లెం పెట్టి అందులో వేయండి. పాదాల ఎముకలు బలపడటమే కాదు. మనసుకీ మంచి వ్యాయామం. ఇది మన మనసు పూర్తి శ్రద్ధ చేసే పని మీదే పెట్టేలా చేస్తుంది. ఏకాగ్రత కలిగించడానికీ సాయపడుతుంది.


* కుర్చీలో నిటారుగా కూర్చోండి. టెన్నిస్‌ బంతి లేదా ముళ్లలా ఉన్న దాన్ని ఎంచుకుని, భూమిమీద ఉంచాలి. ఆ బంతిని పాదం కింద ఉంచి రెండు నిమిషాలు గుండ్రంగా తిప్పాలి. తర్వాత రెండో పాదంతో చేయాలి. దీనివల్ల మడమలు, నడుము నొప్పులు తగ్గుతాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్