ముక్కు దిబ్బడా..

ఈ కాలంలో జలుబు ఎప్పుడైనా పలకరించేస్తుంది. ముక్కు మూసుకొని పోయి.. నిద్ర లేకుండా చేస్తుంది. పోగొట్టుకోవాలా.. ఈ చిట్కాలు ప్రయత్నించేయండి..

Published : 06 Aug 2023 01:10 IST

ఈ కాలంలో జలుబు ఎప్పుడైనా పలకరించేస్తుంది. ముక్కు మూసుకొని పోయి.. నిద్ర లేకుండా చేస్తుంది. పోగొట్టుకోవాలా.. ఈ చిట్కాలు ప్రయత్నించేయండి..

  పాతతరం నుంచి ఉన్న చిట్కా.. వేడినీటితో ఆవిరి పట్టేయొచ్చు. కొందరు బామ్‌ వంటివాటిని వేసి పడుతుంటారు. అది కొన్నిసార్లు ప్రమాదంగా మారొచ్చు. కేవలం నీళ్లు లేదా పసుపు కలిపి పడితే చాలు. యూకలిప్టస్‌ ఆయిల్‌ రెండు, మూడు చుక్కలను ఏదైనా వస్త్రం మీద వేసుకొని లేదా వేడి నీటిలో వేసుకొని ఆవిరి పీల్చినా ఉపశమనం ఉంటుంది.

జలుబు పెద్ద రోగంతో సమానమని ఊరికే అనరు. ఏమీ తినాలనిపించదు.. తాగాలనిపించదు. కానీ వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. అల్లం, తేనె వేసుకొని టీ లేదా వేడి నీటిలో యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి తాగినా మంచిదే! ఇవి కూడా ముక్కు మూసుకుపోకుండా సాయపడతాయి.

ఓ మంచి హ్యుమిడిఫయర్‌ని తెచ్చిపెట్టుకోండి. దీని నుంచి వచ్చే వేడి ఆవిరి ముక్కుదిబ్బడనే కాదు గొంతులో గరగర, దగ్గు, సైనస్‌ సమస్యల నుంచీ ఉపశమనం కలిగిస్తుంది.

పావు గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలిపి గొంతు లోపలికి వెళ్లేలా పుక్కిలించి ఊయండి. రోజులో 3-4 సార్లుచేస్తే సూక్ష్మజీవులను చంపడమే కాదు.. తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఎలాంటి జలుబు లక్షణమైనా దీన్ని ప్రయత్నించొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని