తోటలో తాజా అల్లం..

ఆహారం త్వరగా జీర్ణమవ్వాలన్నా, ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలన్నా ఆశ్రయించే వాటిల్లో అల్లం కూడా ఉంటుంది కదా! ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రోగనిరోధక శక్తినీ అందించే దాన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు.

Updated : 11 Oct 2023 04:17 IST

ఆహారం త్వరగా జీర్ణమవ్వాలన్నా, ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలన్నా ఆశ్రయించే వాటిల్లో అల్లం కూడా ఉంటుంది కదా! ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు రోగనిరోధక శక్తినీ అందించే దాన్ని ఇంట్లోనే పెంచుకోవచ్చు. అవసరమైనప్పుడు తాజాగా వాడేసుకోవచ్చు. దాన్నెలా పెంచాలో చూద్దామా..

కణుపులుండే అయిదు అంగుళాల పొడవున్న అల్లం ముక్కను ఎంచుకోవాలి. ఒక పేపరు టవల్‌ను నీళ్లున్న గిన్నెలో ముంచి, అదనపు నీటిని మృదువుగా పిండాలి. ఈ పేపరు మధ్యలో అల్లం ముక్కనుంచి నాలుగువైపులా పొట్లంలా మూసేయాలి. దీనిపై పొడవైన గాజు గ్లాసును బోర్లించాలి. ఏడెనిమిది రోజులకు అల్లం ముక్కకు వేర్లు రావడం మీరే గమనిస్తారు.

తొట్టెలో..

వేర్లు మొలిచిన అల్లం ముక్కను తీసుకోవాలి. ఒక కప్పు లేదా గ్లాసులో నీటిని తీసుకొని వేర్లు మాత్రమే నీటిలో మునిగి, మిగతా భాగమంతా బయట ఉండేలా చూసుకోవాలి. నాలుగైదు టూత్‌పిక్‌లను గుచ్చి, గ్లాసు కొనమీద ఉంచితే సరి. ఈ పుల్లలు అల్లం నీటిలో మునగకుండా స్టాండులా ఉపయోగపడతాయి. ఇప్పుడీ గ్లాసును ఎండ పడేలా వంటింటి లేదా బాల్కనీ కిటికీలో ఉంచాలి. రెండు వారాలయ్యేలోపు అల్లం మొక్క రావడం మొదలవుతుంది. మట్టి నింపిన తొట్టెను తీసుకొని వేర్లు మట్టిలో ఉండేలా నాటితే సరిపోతుంది. రోజూ కొద్దిగా నీళ్లను చల్లుతూ.. మట్టిలో చెమ్మ మరీ ఎక్కువ, తక్కువ కాకుండా చూసుకోవాలి. దీంతోపాటు రోజూ కాస్తయినా ఎండ పడేలా చూసుకుంటే చాలు. రెండు నెలల్లోపు మొక్క ఆరోగ్యంగా పెరగడమే కాదు, మట్టిలో అల్లం కూడా పెరుగుతుంది. బాగా పెరిగింది అనిపించాక ఒకేసారి తీసుకోవచ్చు. లేదా అవసరమైనంత మేరకు అల్లాన్ని తీసుకొని వినియోగించుకోవచ్చు. కిటికీ, బాల్కనీలో తొట్టెలో తోటలో నేలపై ఎక్కడైనా సులువుగా పెంచుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా అవసరం ఉండదు. ప్రయత్నించి చూడండి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్