అందానికీ, ఆరోగ్యానికీ.. వెరీ గుడ్డు!

బరువు అదుపులో ఉండాలి.. ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇవ్వాలి. వీటిని అందించే ఒక సూపర్‌ ఫుడ్‌ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే గుడ్డును రోజువారీ డైట్‌లో చేర్చుకోండి అంటున్నారు నిపుణులు.

Updated : 13 Oct 2023 03:11 IST

బరువు అదుపులో ఉండాలి.. ఆరోగ్యాన్నీ, అందాన్నీ ఇవ్వాలి. వీటిని అందించే ఒక సూపర్‌ ఫుడ్‌ ఉంటే బాగుండు అని ఎప్పుడైనా అనిపించిందా? అయితే గుడ్డును రోజువారీ డైట్‌లో చేర్చుకోండి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే..

  • ఉదయాన్నే లేచాక నిస్సత్తువగా ఒంట్లోంచి శక్తినంతా తీసేసినట్లుగా అనిపిస్తోందా? ముందు రోజు పని ఎక్కువయ్యో, నిద్ర సరిపోకో అనుకుంటాం కానీ, ఒక్కోసారి విటమిన్‌ డి, బి12 తగినంత మోతాదులో అందకపోయినా ఈ లక్షణాలు కనిపిస్తుంటాయి. గుడ్డును రోజూ తీసుకోండి. ఇది ఈ విటమిన్లను సమృద్ధిగా అందిస్తుంది.
  • గుడ్డులో బి2, బి5, బి12, అమైనో యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మం, కురులు, గోళ్ల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు చర్మానికి తేమను అందిస్తాయి.
  • పనుల హడావుడిలో పడి ఒక్కోసారి ముఖ్యమైన విషయాలనూ మర్చిపోతుంటాం. గుడ్డును తరచూ తీసుకోండి. దీనిలోని కోలీన్‌ అనే మైక్రో న్యూట్రియంట్‌ జ్ఞాపకశక్తిని పెంచడమే కాదు మనలోని భావోద్వేగాలనీ అదుపులో ఉంచుతుంది.
  • అమ్మయ్యాక సహజంగానే ఎముకల్లో బలం తగ్గుతుంది. దీనిలోని విటమిన్‌ డి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటునీ అదుపులో ఉంచుతుంది. ఐరన్‌, ఫోలేట్‌ రక్తహీనతను దరిచేరనీయవు.
  • ‘సరిగా తినరు.. అన్నింటికీ వంకలు పెడతారు’ పిల్లలపై అమ్మలకు ఉండే ఫిర్యాదే ఇది. గుడ్డులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, 13 రకాల విటమిన్లతోపాటు మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజూ ఇస్తే.. వారి శరీరానికి కావాల్సిన పోషకాలను భర్తీ చేసినవారు అవుతారు. చిన్నారుల కాలక్షేపం ఇప్పుడు మొబైళ్లే! ఆ ప్రభావం వారి కళ్లపై పడుతుంది. గుడ్డు పచ్చసొనలోని లూటిన్‌ కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో సాయపడుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్