ఉత్తేజంగా మారాలంటే..!

పెళ్లయ్యి పిల్లలు, పుట్టాక... జీవితం నిస్సారంగా మారిపోయిందనీ, తాము అందరికంటే వెనకపడిపోయామని బాధపడిపోతుంటారు కొందరు.

Published : 18 Mar 2024 01:52 IST

పెళ్లయ్యి పిల్లలు, పుట్టాక... జీవితం నిస్సారంగా మారిపోయిందనీ, తాము అందరికంటే వెనకపడిపోయామని బాధపడిపోతుంటారు కొందరు. ఈ పరిస్థితిని అధిగమించి... మిమ్మల్ని మీరు ఉత్తేజంగా మార్చుకోవాలంటే ఈ సూత్రాలు పాటించి చూడండి.

నిద్రలేచీ లేవగానే పరుగులు తీయడం మానేయండి. రోజూ కంటే ఓ గంట ముందు లేచి చూడండి. ఆ సమయాన్ని మీకోసం మీరు కేటాయించుకోండి. నెమ్మదిగా మొక్కల దగ్గరకి వెళ్లండి. లేదంటే...దగ్గర్లోని పార్కుకి వెళ్లి కాసేపు ఒంటరిగా కూర్చుని రండి. అదీ లేదంటే మేడమీదో, అరుగుమీదో ఒంటరిగా ఓ పదినిమిషాలు కళ్లు మూసుకుని శ్వాస మీద దృష్టిపెట్టండి. మనసు ఎంత ప్రశాంతంగా, చురుగ్గా మారుతుందో మీకే అర్థమవుతుంది. ఆ తరవాత మీ రోజువారీ పనులన్నీ చకచకా పూర్తిచేసేసుకోవచ్చు.

  • రోజూ చేసే పనే కానీ ఎంతకీ ఓ పట్టాన తెమలదు. దానికారణం ఎప్పుడూ చేసే పనే కదా! అన్న నిర్లక్ష్యంకావొచ్చు. సులభంగా పూర్తిచేసేయగలం అన్న అతివిశ్వాసమూ అయి ఉండొచ్చు. ముందు మీరు చేసే పనుల జాబితా రాసి... దానికో సమయ ప్రణాళిక వేసి వంటింట్లో మీకళ్లకు కనిపించేలా ఏర్పాటు చేయండి. ఇలా చేయడం వల్ల మీ పనులన్నీ క్రమ పద్ధతిలో అవుతాయి. ఆలోచనలతో కాలం గడపకుండా స్పష్టత ఉంటుంది. మీ మనసూ తేలిక పడుతుంది.
  • అలసట ఏ పనిలోనైనా ఉంటుంది. దాన్ని ఇష్టంగా మార్చుకుంటేనే...ముందుకు సాగగలం. పాటలు వినడం, డాన్స్‌ చేయడం, నచ్చిన పుస్తకం చదవడం.. ఆసక్తిగా ఉన్న సినిమా చూడటం.. వంటివాటిపైనా మనసు పెట్టండి. కాసేపు ఏదో ఒక వ్యాపకంతో గడిపి చూడండి. ఇట్టే ఒత్తిడి దూరమవుతుంది. మనసుకు హాయిగా ఉంటుంది. ఏదో కోల్పోతున్నామన్న భావన రాదు.
  • తోటివారందరికంటే వెనకబడి ఉన్నామని భావిస్తుంటారు కొందరు. ఇది వారిలో మరింత నిరాశను పెంచుతుంది. ఇంట్లోనే ఉండటం వల్ల తామెందుకూ పనికిరామనీ, బయట ప్రపంచమే తెలియడంలో లేదని భావిస్తుంటారు. ఇలాంటప్పుడు కొన్నాళ్లు దగ్గర్లోని యోగా కేంద్రానికో, మరో వ్యాపకాన్ని నేర్చుకోవడానికి హాబీ సెంటర్‌కో వెళ్లండి. కచ్చితంగా మరో కొత్త ప్రపంచాన్ని చూడటమే కాదు...ఉత్సాహంగానూ ఉండగలరు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్