ఇది తింటే వడదెబ్బ తగలదు!

మార్చి నెల మొదలైందో లేదో ఎండలు మండిపోతున్నాయి. దీంతో అతిదాహం, డీహైడ్రేషన్‌ ప్రభావానికి గురై మరెన్నో అనారోగ్య చిక్కులనూ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే పుచ్చకాయను మించిన పోషకాహారం లేదంటారు వైద్యులు.  

Published : 20 Mar 2024 01:43 IST

మార్చి నెల మొదలైందో లేదో ఎండలు మండిపోతున్నాయి. దీంతో అతిదాహం, డీహైడ్రేషన్‌ ప్రభావానికి గురై మరెన్నో అనారోగ్య చిక్కులనూ ఎదుర్కోవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమించాలంటే పుచ్చకాయను మించిన పోషకాహారం లేదంటారు వైద్యులు. 

నీటి శాతం ఎక్కువ:  వేసవిలో అతిపెద్ద సమస్య డీహైడ్రేషన్‌. శరీరంలో నీటి కొరత వల్ల ఈ ఇబ్బంది ఏర్పడటమే కాదు... వడదెబ్బకు గురయ్యేలానూ చేస్తుంది. అలాకాకూడదంటే రోజూ కనీసం ఓ కప్పు పుచ్చకాయ ముక్కల్ని తింటే సరి. ఎందుకంటే  92 శాతం నీళ్లు, 8 శాతం చక్కెరలతో పాటు ఎలక్ట్రోలైట్స్‌ కూడా ఉంటాయి. ఇవి వేడిని తట్టుకునే శక్తినిస్తాయి. అలానే తీపి అతిగా తినే అలవాటునీ నియంత్రిస్తాయి.

బరువూ తగ్గొచ్చు: పుచ్చకాయలో విటమిన్‌ సి, ఎ, లతో పాటు బి1, బి5, బి6... పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు తగినంతగా లభిస్తాయి. ఇవి వ్యాధినిరోధకశక్తిని మెరుగుపరుస్తాయి. నీరూ, పీచూ ఎక్కువ ఉండటం వల్ల పొట్ట నిండుగా ఉండి... అతి ఆకలి అదుపులో ఉంటుంది. ఇందులోని పాలీఫినాల్స్‌ జీర్ణవ్యవస్థ పనితీరుని చక్కదిద్ది... బరువు తగ్గేందుకు సాయపడతాయి. ఆందోళన తగ్గుతుంది..

నరాల పనితీరు మెరుగ్గా: పుచ్చకాయలో విటమిన్‌ సి తగినంత ఉండి... శరీరం ఇనుముని గ్రహించడంలో సాయపడుతుంది. ఫలితంగా మహిళల్లో రక్తహీనత అదుపులో ఉంటుంది. పొటాషియం రక్తపోటుని తగ్గించి నరాల పనితీరు మెరుగయ్యేలా చేస్తుంది. ఇక, పుచ్చకాయ లోపల ఎర్రటి రంగుకి కారణమైన లైకోపీన్‌ గుండె జబ్బులు, క్యాన్సర్‌ వ్యాధికారకాలను శక్తిమంతంగా అడ్డుకోగలదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్