చలువ చేసే బార్లీ

ఎండలు మండిపోతున్నాయి. కాసేపు బయటకి వెళ్తే చాలు... భానుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేసుకున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఓ గ్లాసు బార్లీ నీళ్లు తాగండి.

Published : 24 Mar 2024 01:25 IST

ఎండలు మండిపోతున్నాయి. కాసేపు బయటకి వెళ్తే చాలు... భానుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేసుకున్నట్లే అనిపిస్తుంది. ఇలాంటప్పుడు ఓ గ్లాసు బార్లీ నీళ్లు తాగండి. వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ ఉన్నాయి.

అజీర్తి దూరం... వేసవిలో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో మలబద్ధకం, గ్యాస్‌, తలనొప్పి...వంటి మరెన్నో సమస్యలు చుట్టుముడతాయి. ఇలాంటప్పుడు గోరువెచ్చగా గ్లాసు బార్లీ నీళ్లు తాగి చూడండి. ఇందులోని పీచు జీర్ణాశయాన్ని శుభ్రపరిచి... అరుగుదల బాగుండేలా చేస్తుంది. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి.

వడదెబ్బ తగలకుండా... ఉదయం అల్పాహారం తీసుకున్నాక... గ్లాసు బార్లీ నీళ్లలో చిటికెడు ఉప్పు, కాస్త పంచదార చేర్చి తాగేయండి. ఇందులో కాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్‌, రాగి.. వంటి మినరల్స్‌, సాల్ట్స్‌తో పాటు ఎన్నో కీలక విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ పుష్కలంగా ఉండి... పోషకాల లోపం రానివ్వవు. అంతేకాదు, ఇవి శరీరంలో నీటి నిల్వల్ని కోల్పోనివ్వవు. వేడి గాలుల ప్రభావానికి చిక్కకుండా కాపాడతాయి. బార్లీలో ఉండే పీచు బరువు తగ్గించడమే కాదు... చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇన్‌ఫెక్షన్‌లు రానివ్వదు... వేసవిలో మహిళల్ని బాధించే అతి వేడి, మూత్ర నాళ ఇన్‌ఫెక్షన్లకు బార్లీ చెక్‌ పెట్టగలదు. దీన్ని జావ, నీళ్లు...ఇలా ఏ రూపంలో తీసుకున్నా మంచిదే. మూత్రంలో ఇన్‌ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మంగా ఉండే రాళ్లూ పోతాయి. గర్భిణులు తాగితే కాళ్ల వాపు సమస్య దరిచేరదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్