ఇంట్లోనే డ్రైఫ్రూట్స్‌ చేద్దామా..!

డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యకరం అయినా... కొనాలంటేనే ఖరీదెక్కువ. అలా డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లోనే తయారు చేసుకుంటే.. భలే ఉంటాయి కదా! పైగా బయట దొరికేవి ఎలా ఉంటాయో అనే భయం ఉండదు.

Published : 26 Mar 2024 02:01 IST

డ్రైఫ్రూట్స్‌ ఆరోగ్యకరం అయినా... కొనాలంటేనే ఖరీదెక్కువ. అలా డబ్బు పెట్టి కొనే బదులు ఇంట్లోనే తయారు చేసుకుంటే.. భలే ఉంటాయి కదా! పైగా బయట దొరికేవి ఎలా ఉంటాయో అనే భయం ఉండదు.

  • డ్రైఫ్రూట్స్ ని తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సిన పండ్లను ఎంపిక చేసుకోవాలి. వీలైనంత  వరకు సిట్రస్‌ ఫ్రూట్స్‌నే ఎంపిక చేసుకుంటేనే మేలు. ఇవి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే నిమ్మరసం కలిపిన నీటిలో కాసేపు నానబెట్టాలి. నిమ్మలో ఉండే ఆమ్లాలు పండ్ల సహజ రంగుని కోల్పోకుండా కాపాడతాయి. మీరు పండ్లకి తీపిని జోడించాలనుకుంటే ఎంచుకున్న పండ్లను షుగర్‌ సిరప్‌లో కాసేపు ఉంచి బయటికి తీయాలి.
  • ఇప్పుడు పండ్లన్నీ ఓ పళ్లెంలో పలుచగా పరిచి దుమ్మూధూళి పడకుండా పలుచని క్లాత్‌ కప్పి ఎండలో ఆరనివ్వాలి. లేదా ఓవెన్‌లో తక్కువ ఉష్ణోగ్రతల వద్ద వేడి చేయాలి. మధ్య మధ్యలో బయటికి తీస్తూ పూర్తిగా డ్రై అయ్యేవరకూ ఉంచాలి.
  • ఇలా తయారు చేసుకున్న పండ్లను పూర్తిగా చల్లారనిచ్చి. తరవాత తేమలేని గాజు సీసాలో నిల్వ చేస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్