మృతకణాలు తొలగించే ముందు..

ముఖానికి అలంకరణ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. చర్మంలో పేరుకొన్న మృతకణాలను ఎప్పటిప్పుడు తొలగించుకోవడం అంతే ముఖ్యం. ఇందుకోసం...

Updated : 09 Dec 2022 13:20 IST

ముఖానికి అలంకరణ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. చర్మంలో పేరుకొన్న మృతకణాలను ఎప్పటిప్పుడు తొలగించుకోవడం అంతే ముఖ్యం. ఇందుకోసం వాడే స్క్రబ్‌ విషయంలో కాస్త అవగాహన పెంచుకుంటే.. అందం, ఆరోగ్యం మన సొంతమవుతాయి. అందుకేం చేయాలంటే..

పొడీ, సున్నితమైన చర్మతత్వం ఉన్నవారు స్క్రబ్‌ని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. స్క్రబ్‌తో అదేపనిగా రుద్దితే సున్నితమైన చర్మం మరింతగా పాడై, పొడిబారుతుంది. దద్దుర్లూ, ఎర్రగా కందిపోవడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే ఈ చర్మతత్వాలు ఉన్నవారు రసాయనాల్లేని సహజ స్క్రబ్‌ని ఎంచుకోవాలి. కోతలూ, గాయాలూ ఉన్నచోట దాన్ని ఉపయోగించకపోవడమే మంచిది.

* చర్మం మరీ సున్నితంగా ఉంటే కనుక స్క్రబ్‌కి బదులుగా బాడీపాలిషింగ్‌ వస్త్రం అని దొరుకుతుంది. దీనినే ఎక్స్‌ఫోలియేటింగ్‌ క్లాత్‌ అనీ అంటారు. దాన్ని ఉపయోగిస్తే వీపు వెనుక, మెడ దగ్గరా ఉండే మృతకణాలు సులభంగా తొలగిపోతాయి. రసాయనాల బెడద ఉండదు. ముఖానికి కూడా ఇంట్లో తయారుచేసుకున్న స్క్రబ్‌నే వాడితే చర్మానికి ఎలాంటి హాని ఉండదు.

* స్క్రబ్‌ని వాడిన తర్వాత చర్మానికి తప్పనిసరిగా మాయిశ్చరైజర్‌ని పట్టించాలి. చర్మం మృదువుగా మారుతుంది.

* జిడ్డు చర్మతత్వం ఉన్నవారికి స్క్రబ్‌ మంచిదే. అయితే వాళ్లు కూడా వారానికి రెండు సార్లు మాత్రమే వాడాలి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్