ఓపికతో నేర్పండి!

పిల్లలకు చిన్నప్పటి నుంచే శుభ్రత ఎలా పాటించాలో నేర్పాలి. ఇంట్లో తల్లి మాత్రమే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు బుజ్జాయి సంరక్షణలో పాలు పంచుకోవాలి....

Updated : 03 Sep 2021 13:16 IST

పిల్లలకు చిన్నప్పటి నుంచే శుభ్రత ఎలా పాటించాలో నేర్పాలి. ఇంట్లో తల్లి మాత్రమే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు బుజ్జాయి సంరక్షణలో పాలు పంచుకోవాలి.

స్నానం... కొంతమంది చిన్నారులకు నీళ్లంటే ఇష్టం. దాంతో స్నానమనగానే ఎగిరి గంతేస్తారు. మరికొందరేమో బాతింగ్‌ అనగానే బయటకు పరిగెత్తుకొస్తారు. ఇంకొందరికి నీళ్లను చూస్తే చిరాకు, కోపం ... ఇలాంటి వారికి నీటి ఉపయోగాలు, స్నానం చేయడం వల్ల కలిగే లాభాలు చెప్పాలి. వాళ్లు సంతోషంగా స్నానం చేసేందుకు బాత్‌ టబ్‌లో వారికిష్టమైన బొమ్మలు వేయాలి. వాటితో ఆడుకుంటూ స్నానం కానిచ్చేస్తారు. ఈ సమయంలోనే కాళ్లు, చేతులు, తల, మిగతా శరీర భాగాలను ఎలా శుభ్రం చేసుకోవాలో నేర్పాలి.

హ్యాండ్‌ వాష్‌...  ఆహారం తీసుకునే ముందు, తిన్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పాలి. అలాగే టాయిలెట్‌కు వెళ్లి వచ్చిన ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని నేర్పాలి. అలా కడుక్కోవడం వల్ల ఎలా ఆరోగ్యంగా ఉంటామో వివరించాలి. చేతులు శుభ్రం చేసుకున్న ప్రతిసారి తనకు ఓ స్టార్‌ను చేతికి అతికించండి. అలాగే మంచి పని చేసావంటూ మెచ్చుకోండి.

దంతధావనం.. దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల కలిగే అనర్థాలను చెప్పాలి. పళ్లను ఎలా శుభ్రం చేసుకోవాలో దగ్గరుండి నేర్పించాలి. చిన్నారుల కోసం ప్రత్యేకంగా తయారుచేసిన కార్టూన్‌  ఆకారంలో ఉండే టూత్‌బ్రష్‌లను ఎంచుకోవాలి. మీరు బ్రష్‌ చేసుకుంటూ తననూ మిమ్మల్ని అనుకరించమని చెప్పాలి. కొన్నాళ్లకు తనకే అలవాటు అయిపోతుంది.

కిందపడిన ఆహారం వద్దు...  మరీ చిన్నారులు చేతి నుంచి కిందపడిన ఆహారాన్ని తీసుకుని నోట్లో పెట్టుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి అలా తినకూడదని, తినడం వల్ల అనారోగ్యం కలుగుతుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్