అనుబంధాలు ఆలంబనగా
close
Published : 15/11/2021 00:36 IST

అనుబంధాలు ఆలంబనగా!

పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే... వారిని పెంచే వాతావరణంలో సానుకూలత ఉండేలా చూసుకోవాలి. ఒత్తిడి దరిచేరకుండా కాపాడుకోవాలి. అందుకోసం కొన్ని సూచనలు చేస్తున్నారు మానసిక నిపుణులు.  

ఇంట్లో గొడవలొద్దు.. తల్లిదండ్రుల తీరు, వారి అన్యోన్యత చిన్నారుల ఎదుగుదలపై ప్రభావం చూపిస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వారి ముందు వాదులాడుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం వంటివి చేయొద్దు. మీ ముందు వారు భయపడకపోయినా... లోలోపల కుంగిపోతుంటారు. దాంతో ఇతరులను ద్వేషించడం లేదా మితిమీరిన అల్లరి, ముభావంగా ఉండటం వంటివి చేస్తుంటారు. చదువు, ఆటపాటల్లో వెనకపడతారు. పిల్లల భావోద్వేగాలను గమనించాలి. వాటిని తగ్గించేందుకు ఇంటివాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. మీ కుటుంబ అనుబంధాలను కాపాడుకుంటూ...చిన్నారుల మనోవికాసానికి తోడ్పడాల్సింది తల్లిగా మీరే.

కలిసిపోనివ్వండి... కుటుంబంలోని వ్యక్తులు, ఇతరులతో ప్రవర్తించే తీరు, బంధుమిత్రులు, ఇరుగుపొరుగుతో ఉండే సత్సంబంధాలు వారి చిట్టి మనసుల ఆలోచనా పరిధిని పెంచుతాయి.  ఫలితంగా సామాజిక చొరవ, అనుబంధాల్లోని సున్నితత్వం అర్థమవుతాయి. అప్పుడే ఒంటరిగా కాకుండా అందరితో కలిసి ఉండటానికి ప్రాధాన్యం ఇస్తారు. ఇతరుల కష్టాన్ని అర్థం చేసుకోగలరు. తల్లిగా మీరు కూడా వారి వయసు పిల్లలతో మంచి స్నేహ బంధాన్ని ఏర్పరుచుకునేలా వెన్ను తట్టండి. ఇదంతా వారి భవిష్యత్తుని బంగారు మయం చేసేదే.

కష్టాలకు వెరవకుండా... పిల్లలపై గారాబంతో....కోరినవీ, కోరనవీ అన్నీ తెచ్చి ఇస్తుంటారు కొందరు. అలా చేస్తేనే ప్రేమ కాదు...వారి నూరేళ్ల జీవితం దృష్టిలో పెట్టుకుని వారికి సంతోషమైన అలవాట్లను నేర్పించాలి. ఇతరుల గెలుపుని నిజాయతీగా అంగీకరించడం, కష్టపడటం, ఓటమి నుంచి కొత్త పాఠాన్ని నేర్చుకోవడం వంటివన్నీ వారిని మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. చిన్నచిన్న అంశాలకు కుంగిపోయేలా చేయవు. వ్యక్తిగత క్రమశిక్షణ వారిని ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని