అలా చదివితే మేలే...

పిల్లలు ఎవరికి వారు చదువుకోవడం మామూలే. అలాకాకుండా గ్రూప్‌ స్టడీలో పాల్గొనడం వల్ల ప్రయోజనాలున్నాయి అంటున్నారు నిపుణులు...

Published : 18 Mar 2024 01:59 IST

పిల్లలు ఎవరికి వారు చదువుకోవడం మామూలే. అలాకాకుండా గ్రూప్‌ స్టడీలో పాల్గొనడం వల్ల ప్రయోజనాలున్నాయి అంటున్నారు నిపుణులు...

పిల్లలు ఒంటరిగా చదువుతున్నప్పుడు ఏదో మొక్కుబడిగా చదువుతూ బోర్‌గా ఫీలవుతుంటారు. కొన్ని సబ్జెక్టులు ఇంకెప్పుడైనా చదువుదాం అని వాయిదా వేస్తుంటారు. అదే వారి స్నేహితులతో గ్రూప్‌ స్టడీ చేయండి అంటే చాలు ఎంతో ఉత్సాహం చూపిస్తారు. దీనివల్ల వాయిదా విధానాన్ని మానుకుంటారు.

  • కలిసి చదవడంవల్ల వారిలో బృంద స్ఫూర్తి ఏర్పడుతుంది. మీ పిల్లలు సిగ్గుపడేవారైతే స్నేహితులతో చదవడమే మంచిది. సందేహాలను పంచుకోవడం వల్ల వాళ్లల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరుగుతాయి. బాల్యం నుంచే వారిలో నాయకత్వ లక్షణాలు అలవడతాయి.
  • ఎవరికి వారు చదువుకునేటప్పుడు తాము చదివిందే కర్టెక్‌ అనుకుంటారు. దానివల్ల పరీక్షలో తప్పుడు సమాధానాలు రాస్తుంటారు. అదే గ్రూప్‌ స్టడీ చేయడం వల్ల తప్పొప్పులు సరిచూసుకోగలరు. అంతేకాదు, పిల్లలకు అన్ని సబ్జెక్టులూ సరిగా అర్థం కాకపోవచ్చు. అదే ఒకరికొకరు చెప్పుకోవడంవల్ల తేలికగా నేర్చుకుంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్